ఏషియా నెట్ న్యూస్ మలయాళం ఛానల్ ను 48 గంటల పాటు నిషేధం విధిస్తు సమాచార ప్రసారాల శాఖ  నిర్ణయం తీసుకున్న తరువాత కేవలం కొద్దీ గంటల్లోనే తిరిగి ఆ ఛానల్ ప్రసారాలు మొదలయ్యాయి. దీనిపై ఆ ఛానల్ ఎడిటర్ రాధాకృష్ణన్ ఒక ప్రకటనను విడుదల చేసారు. 

ఏషియా నెట్ న్యూస్ పై 48 గంటలపాటు నిషేధం విధించడం తొందరపాటు చర్య అని అని కేంద్ర ప్రసారాల శాఖ మంత్రి  జవదేకర్ చెప్పిన విషయాన్నీ వక్కాణిస్తూ... తాము ఎటువంటి  పాత్రికేయ విలువలకు  భంగం కలిగించలేదని ఏషియా నెట్ న్యూస్ ఎడిటర్ రాధాకృష్ణన్  అన్నారు. 

సాధారణంగా ఎవ్వరికైనా తమ వాదనను వినిపించే హక్కును  కల్పిస్తుందని... కానీ ఈ విషయంలో తమకు  కల్పించకుండానే సమాచార, ప్రసార శాఖ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని, ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. 

వాస్తవానికి 25 ఏండ్లుగా ప్రజల  చూరగొని నెంబర్ వన్ ఛానల్  దూసుకుపోతున్న తాము ఏనాడు కూడా ఎటువంటి తప్పుడు వార్తల జోలీకి వెళ్లలేదని, పాత్రికేయ విలువలను ఎన్నడూ మరువలేదని ఈ సందర్భంగా ఈ ప్రకటనలో ఆయన గుర్తుచేశారు. 

సమాజంలోని ప్రతి పౌరుడు, సంస్థ ఎలాగైతే ఈ దేశ న్యాయ వ్యవస్థను  కూడా అలాగే గౌరవిస్తామని, ఏనాడు కూడా ఆ గీతను జవదాటలేదని,  లక్ష్మణ రేఖగా పనిచేసాము తప్ప... దాన్ని తాము ఎన్నడూ ధిక్కరించలేదని, భవిష్యత్తులో కూడా ధిక్కరించబోమని ఆయన కుండా బద్దలుకొట్టారు. 

ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా తమ  బాధ్యతలను ఎరిగి మసులుకున్నామని, ఏనాడూ వాటిని అతిక్రమించదల్చుకోలేదని, ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా తెలియక ఆ గీత దాటితే తాము తదనంతర పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధులమని, తమను తాము వెంటనే కరెక్ట్ చేసుకుంటామని ఈ సందర్భంగా ఎడిటర్ అభిప్రాయపడ్డారు. 

కానీ ఈ విషయంలో తమకు తమ వెర్షన్ వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని, ఇది ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. ఇలా 48 గంటల పాటు ఏకపక్షంగా నిషేధం విధించడం మీడియా భావ ప్రకటనా స్వేఛ్చను హరించి వేయడమే నని, ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇలాంటి క్లిష్ట విపత్కర పరిస్థితుల్లో కూడా ఏషియా నెట్ న్యూస్ తో పాటుగా నిలిచినందుకు, ఏషియా నెట్ న్యూస్ నిజాయితీగల దమ్మున్న ఛానల్ అని నమ్మి తమకు సపోర్ట్ చేసిన ప్రేక్షకాభిమానులందరికీ ఎడిటర్ రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రేక్షకులు   నిలబెట్టుకునేందుకు నిరంతరం తమ వంతుగా బాధ్యతాయుతమైన జర్నలిజం తో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ... ప్రజలకోసం పనిచేస్తూ, ప్రజాశ్రేయస్సు కోసం తమ బాధ్యతను నిర్వర్తిస్తామని, దేశ చట్టాల్లో పొందుపర్చిన ఏ అంశాన్ని కూడా తాము ఎన్నటికీ అతిక్రమించబోమని ఎడిటర్ రాధాకృష్ణన్ పునరుద్ఘాటించారు.