స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రజల తీర్పు ఎల్‌డిఎఫ్‌కు అనుకూలంగా ఉంటుందని ఆసియానెట్ న్యూస్ ముందుగానే ఊహించింది. కోవిడ్ 19 కి ముందు, ఆ తర్వాత కేరళలో మారుతున్న రాజకీయ వాతావరణం గురించి 2020 జూలైలో ఏషియానెట్ న్యూస్ - సి ఫోర్ లోతుగా పరిశీలించింది. నిన్నటి తుది ఫలితాలు ఏషియానెట్ న్యూస్ సర్వే చెప్పినదానికి దగ్గరగా వుంది. 

ఎన్నికలు సమయంలో కేరళీయుల మనసులో ఏముంది? అనే దానిపై సి ఫోర్ సహాయంతో ఏషియానెట్ న్యూస్ కేరళ వ్యాప్తంగా యాభై అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పదివేల చొప్పున శాంపిల్స్ తీసుకుంది.

రాష్ట్ర జనాభాలో ఎక్కువ మంది పినరయ్ విజయన్ కోవిడ్‌ 19ను ఎదుర్కొన్న విధానంపై సంతృప్తి చెందినట్లు సర్వే ఫలితాలు సూచించాయి. ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ పనితీరు పట్ల రాష్ట్ర ప్రజలు ఆకట్టుకున్నారని సర్వేలో వెల్లడైంది.

మొత్తం ఓట్లలో 45 శాతం ఓట్లు ఎల్‌డిఎఫ్‌కు పడతాయని సర్వే ఫలితాలు అంచనా వేశాయి. కాంగ్రెస్ 39 శాతం ఓట్లు సాధిస్తుందని, ఎన్డీఏకు 18 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. అలాగే పినరయి విజయన్ ప్రభుత్వానికి రెండవసారి అవకాశం ఉందని తెలిపింది. జూలైలో నిర్వహించిన ఏషియానెట్ న్యూస్ సర్వేలో అంచనాలు ప్రస్తుతం వాస్తవ రూపం దాల్చాయి.

సర్వేలో స్థానిక ఎన్నికల ప్రస్తావన:

తాజా స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధిస్తుందో ఆసియానెట్ న్యూస్- సీ ఫోర్స్ సర్వే తేల్చేందుకు ప్రయత్నించింది. సర్వేలో ఆధునిక ప్రచార పద్ధతులను వాడటానికి ఇది సాక్ష్యంగా నిలిచింది. అయితే స్థానిక ఎన్నికల్లో పినరయి విజయన్ ప్రభుత్వానిదే హవా అని సర్వే తేల్చి చెప్పింది. 

45 శాతం ఓట్లతో 46 శాతం మంది ప్రజల మద్ధతును ఎల్‌డీఎఫ్ పొందుతుందని సర్వే అంచనా వేసింది. ఇక యూడీఎఫ్ 39 శాతం ఓట్లతో 32 శాతం మద్ధతు కూడగట్టుకుంటుందని తెలిపింది. ఎన్డీఏ 18 శాతం ఓట్లతో 12 శాతం మంది మద్ధతు పొందుతుందని పేర్కొంది.

అలాగే కేఎం మణి లేని కాంగ్రెస్, జోస్ కే మణి లేకుండా యూడీఎఫ్‌‌లు కేరళ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని సర్వే చర్చించింది. కేఎం మణి మరణం యూడీఎఫ్‌ను బలహీనపరుస్తుందా లేదా అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతికే పనిలో పడింది. దీనిలో భాగంగా 46 శాతం మంది యూడీఎఫ్‌కు ఇది పెద్ద దెబ్బేనని అభిప్రాయపడ్డారు. 

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేయడంతో పినరయి విజయన్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొందా లేదా అన్న దానిపైనా ఏషియానెట్- సీ ఫోర్స్ సర్వే ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కేంద్ర చర్యలు రాష్ట్రానికి సహాయపడతాయని 67 శాతం మంది అభిప్రాయపడగా, 33 శాతం మంది మాత్రం ఏటూ తేల్చేకోలేకపోయారు. 

ఏషియా నెట్ సర్వేలో పాల్గొన్న వారిలో కొందరు కేంద్రం కోవిడ్ విషయంలో వ్యవహరించిన విధానాల వల్లే కేరళలో బీజేపీ బాగా పుంజుకుందని అభిప్రాయపడ్డారు అయితే దీనిని వ్యతిరేకించేవారు రెట్టింపు సంఖ్యలో వున్నారు.

కరోనాపై నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న చర్యలు కేరళలో బీజేపీ బలోపేతానికి దోహదమయ్యాయని 33 శాతం అభిప్రాయపడగా, 67 శాతం మంది మాత్రం ఏం చెప్పలేకపోయారు. మొత్తం మీద ఏషియానెట్- సీ ఫోర్స్ సర్వేకు దగ్గరగా కేరళలో స్థానిక సంస్థల ఫలితాలు రావడం విశేషం.

రాష్ట్రంలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10,409 మంది ఓటర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ అభిప్రాయాలను మదింపు చేసిన ఏషియానెట్ - సీ ఫోర్స్‌ ఫలితాలను విశ్లేషించింది. రాష్ట్రంలో జూన్ 18 నుండి 29 వరకు నిర్వహించిన సర్వే.. రాష్ట్ర రాజకీయాలతో పాటు రాజకీయ నాయకుపై కోవిడ్ ఎలాంటి ప్రభావాలను చూపిందో అంచనా వేసింది.