భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆజాదీకా అమృత మహోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏషియా నెట్ న్యూస్, ఎన్.సి.సి సంయుక్తంగా వజ్ర జయంతి యాత్ర చేపట్టింది. 

కేరళ: భారతదేశానికి స్వాతంత్య్రం వరించి 75వ వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ మీడియా దిగ్గజం ఏషియా నెట్ న్యూస్ (Asianet news) మరియు ఎన్.సి.సి (NCC) (నేషనల్ కాడెట్ కార్ప్) 'వజ్ర జయంతి యాత్ర' చేపట్టింది. 20 మంది ఎన్.సి.సి క్యాడెట్ల తో కూడిన కేరళ యాత్రను ఆ రాష్ట్ర గవర్నర్ ఆరీఫ్ మొహ్మద్ ఖాన్ జెండా ఊపి ప్రారంభించారు. భారత సాత్రంత్ర్య ఉద్యమ చరిత్రను, దేశ మిలిటరీ సామర్థ్యాన్ని తెలిపేలా, వ్యవసాయం, దేశ సంస్కృతీ సాంప్రదాయాలు, సాంకేతిక రంగ అభివృద్దిని తెలిపేలా ఈ యాత్ర సాగనుంది. 

మన దేశ ఔన్నత్యాన్ని చాటేలా సాగుతున్న ఈ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను స్నేహితులకు, కుటుంబసభ్యులు, ఇతరులతో పంచుకోవాలని ఏషియానెట్ న్యూస్ మీడియా ఆండ్ ఎంటర్టైన్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజేష్ కల్రా సూచించారు. దీంతో వారిలోనూ స్పూర్తి రగులుతుందన్నారు. 

Video

వజ్ర జయంతి యాత్ర ప్రారంభోత్సవంతో పాటు ఇవాళ బ్లడ్ డొనేషన్ డే కావడంతో నిర్వహకులు రక్తదాన శిబిరం ఏర్పాటుచేసారు. ఇందులో 75మంది ఎన్.సి.సి క్యాడేట్లు పాల్గొని రక్తాన్ని దానం చేసారు. ఇతరుకు ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడేలా తమ రక్తాన్ని దానం చేసిన విద్యార్థులకు అతిథులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఏషియా నెట్ న్యూస్ బిజినెస్ హెడ్ ఫ్రాంక్ పి థామస్, ఎడిటర్ కే దాస్, ఎడిటోరియల్ అడ్వైజర్ ఎంజీ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు భారీసంఖ్యలో ఎన్.సి.సి క్యాడేట్లు పాల్గొన్నారు.