మతిస్థిమితం లేని యువతి పట్ల ఓ పోలీసు అధికారి అత్యంత హేయంగా ప్రవర్తించాడు. బెదిరించి, ఎత్తుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో సదరు కీచక ఏఎస్ఐకి కోర్టు 20 యేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలికి లక్ష రూపాయల జరిమానా అందించాలని ఆదేశించింది.
మైసూరు : ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి mental condition సరిగా లేని యువతిని చెరబట్టిన కామాంధుడికి court కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల imprisonmentతో పాటు.. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లికార్జునస్వామి మంగళవారం తీర్పు వెలువరించారు.
ఒంటరి యువతిని చూసి..
2017 జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్ళినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి molestation చేశాడు. మరుసటి రోజు ఈ దారుణం యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
ఉమేశయ్య నేరం చేసినట్టు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. బాధితురాలికి దోషి లక్ష రూపాయల జరిమానా అందించాలని ఆదేశించారు. కాగా, ఉమేశయ్య జీపు డ్రైవర్ పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా, ఇలాంటి దారుణమైన ఘటనే నిరుడు డిసెంబర్ చివర్లో తెలంగాణలోని నల్గొండలో వెలుగు చూసింది. మానసికస్థితి బాగోలేని.. ఎవరితో ఏ విషయాన్నీ చెప్పుకోలేని పరిస్థితితో ఉన్న ఓ బాలిక మీద కామాంధులు కన్నేశారు. ఇదే అదనుగా భావించిన ఏడుగురు మృగాళ్లు ఆ బాలిక మీద ఏడు నెలలుగా Sexual assaultకి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన Nallagonda district మర్రిగూడ మండల కేంద్రం నుంచి చౌటుప్పల్ కు వెళ్లే దారిలో ఉన్న ఓ గ్రామంలో చోటు చేసుకుంది.
సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ దళిత దంపతులకు మానసిక స్థితి సరిగాలేని ఓ కుమార్తె (16) ఉంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో గ్రామానికి చెందిన ప్రభుత్వ చిరుద్యోగి ఒకడు బాలిక ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత మైనర్ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని తాగిన మైకంలో గ్రామానికి చెందిన తోటి స్నేహితులతో పంచుకున్నాడు.
దీంతో అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు కూడా ఆ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఏడు నెలలుగా ఏడుగురు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఆ బాలిక ఆరోగ్యం క్షీణించి, నీరసిస్తుండడంతో.. ఈ పరిస్థితిని గమనించిన తల్లి స్థానిక వైద్యుడు వద్దకు తీసుకువెళ్లింది. ఆ బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భవతి అని నిర్థారించాడు ఇది విని తల్లి షాక్ అయ్యింది. ఆ తరువాత కూతురితో ఇంటికి చేరుకుని.. మూడు రోజులుగా తల్లిదండ్రులు, మేనమామ, బంధువులు బాలికను రకరకాలుగా ప్రశ్నించారు. చివరికి బాలిక గ్రామానికి చెందిన ఏడుగురు తన మీద లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని వివరించగలిగింది.
