Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ త‌దుప‌రి చీఫ్ గా రాహుల్ గాంధీ.. అశోక్ గెహ్లాట్ కీల‌క వ్యాఖ్య‌లు

రాజస్థాన్: కాంగ్రెస్ చీఫ్ కు సంబంధించి త‌ర్వ‌లోనే ఎన్నిక‌ జ‌ర‌గ‌నుంది. అయితే, వయనాడ్ ఎంపీ  రాహుల్ గాంధీ ఇంకా ఈ అంశంపై తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతోంది. 
 

Ashok Gehlot's key comments saying that Rahul Gandhi will be the next chief of Congress
Author
First Published Aug 22, 2022, 10:59 PM IST

కాంగ్రెస్ పార్టీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ సోమవారం మాట్లాడుతూ రాహుల్ గాంధీ తదుపరి పార్టీ అధ్యక్షుడయ్యేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ 'ఏకగ్రీవంగా' ఉందని అన్నారు. “రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా రాకపోతే, అది దేశంలోని కాంగ్రెసోళ్లకు నిరాశే” అని ఆయన అన్నారు.  కాగా, ఆగస్టు 22-సెప్టెంబర్ 20 మధ్య పార్టీ చీఫ్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, దీనిపై వయనాడ్ పార్ల‌మెంట్ స‌భ్యుడైన రాహుల్ గాంధీ ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన తల్లి సోనియా గాంధీ ఈ పదవికి సారథ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీని కొత్త అధ్యక్షుడిగా చేయాలనే అభిప్రాయం పార్టీలో ఉందని అశోక్ గెహ్లాట్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాహుల్ గాంధీ దీనిని అంగీకరించాలన్నారు. 

"రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా రాకపోతే, అది దేశంలోని కాంగ్రెసోళ్లకు నిరాశే. చాలా మంది ఇంట్లో కూర్చుంటారు. మేము బాధపడతాము. దేశంలోని సాధారణ కాంగ్రెస్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని రాహుల్ గాంధీ స్వయంగా ఈ పదవిని స్వీకరించాలి" అని గెహ్లాట్‌ను అన్నారు. "ఏకగ్రీవమైన అభిప్రాయం ఆయన కాంగ్రెస్ చీఫ్ కావడానికి మద్దతుగా ఉంది. కాబట్టి, ఆయ‌న దానిని అంగీకరించాలని నేను భావిస్తున్నాను. ఇది గాంధీ లేదా గాంధీయేతర కుటుంబానికి సంబంధించినది కాదు. ఇది సంస్థ  పని అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని ప్రస్తుత స్కీమ్‌లో గాంధీ కుటుంబం పాత్రను ప్రశ్నించిన పార్టీ లోపల.. వెలుపల ఉన్నవారికి కూడా గెహ్లాట్ చుర‌క‌లంటించారు. 

‘‘గత 32 ఏళ్లలో గాంధీ కుటుంబం నుంచి ఏ వ్యక్తి కూడా ప్రధాని కాలేకపోయారు. కేంద్ర మంత్రి లేదా ముఖ్యమంత్రి కాలేకపోయారు. అలాంటప్పుడు న‌రేంద్ర మోడీకి ఈ కుటుంబానికి ఎందుకు భయం? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఆ రాష్ట్రంలో ఏమీ జరగలేదని ఎందుకు చెప్పాలి? గత 75 ఏళ్లలో దేశం ఏమి జ‌ర‌గ‌లేదా? అందరూ కాంగ్రెస్‌పై ఎందుకు దాడి చేస్తున్నారు?" అని ప్ర‌శ్నించారు. గత 75 ఏళ్లుగా  పార్టీ దేశ ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచిందని, అందుకే న‌రేంద్ర‌ మోడీ ఇప్పుడు ప్రధానిగా, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన అన్నారు. 75 ఏళ్లలో కాంగ్రెస్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని సజీవంగా ఉంచిందని, ఇది దేశానికి కాంగ్రెస్ ఇచ్చిన బహుమతి అని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మరోసారి విజయం సాధిస్తుందని గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు.

‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆపై 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ గెలుస్తాం.. ఈసారి మోడీకి ఇది అంత తేలికైన ఆట కాదు. బీహార్‌లో బీజేపీకి నితీశ్‌ కుమార్‌ దెబ్బ కొట్టిన తీరు, కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ఇరుకున పెట్టింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యపై రాహుల్ గాంధీ నేతృత్వంలోని నిరసనలతో మోడీ ప్రభుత్వం కదిలింది”అని గెహ్లాట్ అన్నారు. కాగా, ప్ర‌స్తుతం అందుతున్న మీడియా రిపోర్టుల ప్ర‌కారం కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని పార్టీ చీఫ్‌గా చేయాలంటూ చేసిన అభ్యర్థనలకు ఎటువంటి స్పందన రాలేదు. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఓట‌మికి నైతిక బాధ్య‌త వ‌హిస్తున్న కాంగ్రెస్ చీఫ్ గా త‌ప్పుకున్నారు. మ‌రోసారి రాహుల్ గాంధీ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని పార్టీ శ్రేణులు కోరుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios