దేశరాజధాని ఢిల్లీలోని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

దేశరాజధాని ఢిల్లీలోని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఒవైసీ నివాసంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి అనంతరం అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన నివాసానికి అదనపు డీసీపీ వెళ్లారు. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 

దెబ్బతిన్న కిటికీలు

ఓవైసీ తన నివాసంపై దుండగులు రాళ్లు రువ్వి కిటికీలను ధ్వంసం చేశారని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో తన ఫిర్యాదులో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఆరోపించారు. రాత్రి 11:30 గంటలకు నేను నా నివాసానికి చేరుకున్నప్పుడు, కిటికీ అద్దాలు పగలగొట్టి, చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని కనుగొన్నాను, సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో దుండగులు గుంపు నివాసంపై రాళ్లు రువ్వారని తన ఇంటి సేవకుడు తనకి చెప్పారని తెలిపారు.

నిందితులను త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్‌ 

తన నివాసంపై దాడి చేయడం ఇది నాలుగోసారి అని ఏఐఎంఐఎం చీఫ్ చెప్పారు. ఇలాంటి దాడి జరగడం ఇది నాలుగోసారి అని ఒవైసీ అన్నారు. తన ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, కాబట్టి నిందితులను వెంటనే పట్టుకోవాలని ఎంపీ అన్నారు. నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లేఖ రాశారు.

Scroll to load tweet…