భారతీయ మూలాలకు చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడంతో దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు రాజకీయ వ్యాఖ్యలు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
భారతీయ మూలాలకు చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మరింది. ముఖ్యంగా మనదేశంలో రాజకీయ వ్యాఖ్యలు వెల్లువెత్తున్నాయి. ఈ తరుణంలో దేశ అత్యున్నత స్థానంలో మైనార్టీలను ఎంచుకునే సాంప్రదాయాన్ని ఏదో ఒకరోజు మన దేశం కూడా పాటిస్తుందని ప్రతిపక్షాలు రాజకీయ వ్యాఖ్యానాలు ప్రారంభమయ్యాయి.
ఈ తరుణంలో ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకలోని బిజ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ హిజాబ్ ధరించిన అమ్మాయి భారత ప్రధాని అవుతుందని అన్నారు. వాస్తవానికి శశి థరూర్ చేసిన ట్వీట్‌పై మీడియా అతనిని స్పందన కోరింది. దీనిపై ఆయన ఇలా అన్నారు. ఇన్‌షా అల్లాహ్..నా జీవితంలో లేదా నా తరువాత హిజాబ్ ధరించే ఓ అమ్మాయి భారతదేశ ప్రధాని అవుతుందని.. తాను ఇప్పటికే చెప్పానని అన్నారు
వాస్తవానికి రిషి సునక్ ప్రధాని ఎన్నికకు కొద్దిసేపటి క్రితమే శశి థరూర్ ట్వీట్ చేశారు. బ్రిటీషు ప్రజలు ప్రపంచంలో చాలా అరుదైన, అసాధ్యమైన పనిని చేశారనీ, మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఒక సభ్యునికి వారి అత్యంత శక్తివంతమైన కార్యాలయంలో అధికారాన్ని కల్పించారని, మనమందరం అంగీకరించాలని శశి థరూర్ వ్యాఖ్యానించారు. భారత సంతతి చెందిన రిషి కోసం వేడుక చేసుకుందాం.. మరీ ఇలా భారత్ లో జరుగుతుందా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కూడా స్పందించారు. మొన్న కమలా హ్యారిస్..ఇప్పుడు రిషి సునక్. అమెరికా, బ్రిటీషు ప్రజలు తమ దేశంలో మైనార్టీ ప్రజలను అధికారం అందిస్తున్నారు. అక్కడి వారు మైనార్టీలకు అత్యున్నత పదవికి ఎన్నుకున్నారు. ఈ ఘటన నుంచి మనదేశంలో బహుసంఖ్యాక వర్గాల పాలకులు పాఠం నేర్చుకోవాలని పేర్కోంటూ చిదంబర్ ట్వీట్ చేశారు.
అటు రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ ఛీప్ మహబూబా ముఫ్తీ కూడా ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటీషు ప్రజలు ఓ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని తమ ప్రధానిగా ఎన్నుకున్నారు. కానీ మనం మాత్రం ఇప్పటికీ ఎన్ఆర్‌సీ, సీఏఏ వంటి విభజన అంటూ వివాదాస్ప చట్టాలను తీసుకొస్తున్నామని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షల ట్విట్ లపై బీజేపీ స్పందించింది. భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్.. ఓ సమర్ధవంతమైన నేత అని కొనియాడింది. ఆయన అసాధారణ విజయంపై ప్రశంసించాలనీ.. కానీ, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించింది. ఈ విషయంపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకులు చిదంబరం, శశి థరూర్ వ్యాఖ్యల్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు.
'ఇది ఎలాంటి ప్రేమ'? భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఒవైసీ ప్రకటన -
అంతకు ముందు.. ముస్లింలను దేశం నుంచి దూరం చేయడమే బీజేపీ ధ్యేయమని ఏఐఎంఐఎం చీఫ్ అన్నారు. హలాల్ మాంసం వల్ల దేశానికి ముప్పు, ముస్లిం గడ్డానికి ముప్పు, ముస్లిమ్ కు టోపీ పెడితే ముప్పు, ముస్లిమ్ తిండి, పానీయం, దుస్తులు, బంగారం అన్నీ ప్రమాదకరమే. ముస్లిం గుర్తింపుకు బీజేపీ వ్యతిరేకం.ముస్లింలను బహిష్కరించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు.
ముస్లింల గుర్తింపును శాశ్వతంగా నాశనం చేయడమే బీజేపీ ఎజెండా అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అంటారని, అయితే అది నోటి మాట మాత్రమేనని, దేశ వైవిధ్యాన్ని, ముస్లిం గుర్తింపును బీజేపీ నాశనం చేస్తుందని, ఎన్‌ఆర్‌సీని ప్రభుత్వం బ్యాక్‌డోర్ నుంచి తీసుకువస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
