అసదుద్దీన్ ఒవైసీ: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్ & మరిన్ని
Asaduddin Owaisi Biography: అసదుద్దీన్ ఒవైసీ .. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు. ఆయన నాలుగు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మేల్యే గా హైదరాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మైనారిటీలు, ముస్లింలు, దళితుల సెంటర్ గా ఆయన రాజకీయాలుంటాయి. ఆయన ఉపన్యాసాలు పలు సార్లు వివాదాస్పదం కావడంతో తరుచు వార్తల్లో నిలుస్తారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం.
Asaduddin Owaisi Biography: అసదుద్దీన్ ఒవైసీ .. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు. ఆయన నాలుగు సార్లు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మేల్యే గా హైదరాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశాకా, ఉన్నత చదువుల కోసం ఆయన లండన్‌కి వెళ్లారు. అక్కడ లింకన్స్ ఇన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా, బారిస్టర్-ఎట్-లా పూర్తి చేసి న్యాయవాది అయ్యారు. ఆ తరువాత వారసత్వంగా వస్తున్న రాజకీయాల్లోకి ఏంట్రీ ఇచ్చారు. మైనారిటీలు, ముస్లింలు, దళితుల సెంటర్ గా ఆయన రాజకీయాలుంటాయి. ఆయన ఉపన్యాసాలు పలు సార్లు వివాదాస్పదం కావడంతో తరుచు వార్తల్లో నిలుస్తారు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం.
అసదుద్దీన్ ఒవైసీ బాల్యం & కుటుంబం
అసదుద్దీన్ ఒవైసీ మే 13, 1969న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో జన్మించారు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి పేరు సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, తల్లి పేరు నజ్మున్నీసా బేగం. అసదుద్దీన్ ఒవైసీ డిసెంబర్ 11, 1996లో ఫర్హీన్ ఒవైసీని వివాహం చేసుకున్నారు. ఓవైసికి ఆరుగురు పిల్లలు. అందులో ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు. కొడుకు పేరు సుల్లానుద్దీన్ ఒవైసీ కాగా, కూతుళ్ల పేర్లు ఖుద్సియా ఒవైసీ, యాస్మిన్ ఒవైసీ, అమీనా ఒవైసీ, మహీన్ ఒవైసీ, అతికా ఒవైసీ. అసదుద్దీన్ ఒవైసీకి ఓ సోదరుడు కూడా ఉన్నాడు, అతని పేరు అక్బరుద్దీన్ ఒబాసి. ఆయన కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు. అసదుద్దీన్ ఒవైసీ కుటుంబం ఇప్పటికే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. అసదుద్దీన్ ఒవైసీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి.
అసదుద్దీన్ ఒవైసీ విద్యార్హతలు
అసదుద్దీన్ ఒవైసీ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను అభ్యసించారు . ఆ తర్వాత హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ (ఉస్మానియా యూనివర్సిటీ ) నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశాకా, ఉన్నత చదువుల కోసం ఆయన 1989-94లో లండన్‌కి వెళ్లారు. అక్కడ లింకన్స్ ఇన్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా, బారిస్టర్-ఎట్-లా పూర్తి చేసి న్యాయవాది అయ్యారు. ఒవైసీ మంచి క్రికెటర్ కూడా .. ఆయన 1994లో విజ్జీ ట్రోఫీలో ఫాస్ట్ బౌలర్‌గా సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ U-25s క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తరువాత సౌత్ జోన్ విశ్వవిద్యాలయ జట్టులో ఎంపికయ్యాడు .
అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ జీవితం
అసదుద్దీన్ ఒవైసీది రాజకీయ నేపథ్యం గల కుటుంబం. ఒవైసీ చదువు తర్వాత పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఒవైసీ రాజకీయ ప్రయాణం ప్రారంభాన్ని అర్థం చేసుకోవడానికి, అతని పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చరిత్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ ప్రయాణ కథ ఆ చరిత్రలో దాగి ఉంది.
నవాబ్ మహమూద్ ఖాన్ 1928 సంవత్సరంలో మజ్లిస్‌ను స్థాపించారు. ఆయన 1948 వరకు హైదరాబాద్ సంస్థకు బాధ్యత వహించాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఈ సంస్థ హైదరాబాద్‌ను స్వతంత్రంగా ఉంచాలని వాదించింది. అందుకే 1948 సంవత్సరంలో హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయినప్పుడు, అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ఈ సంస్థ నిషేధించబడింది.
అప్పట్లో మజ్లిస్ అధ్యక్షుడిగా ఉన్న ఖాసీం రాజ్మీని అరెస్ట్ చేశారు. అయితే తర్వాత ఖాసిం రాజ్మీ పాకిస్థాన్ వెళ్లి ఆ సంస్థ బాధ్యతలను అప్పటి ప్రముఖ న్యాయవాది అబ్దుల్ వహాద్ ఒవైసీకి అప్పగించడంతో అక్కడి నుంచి మజ్లిస్‌లో ఒవైసీ కుటుంబం ప్రవేశం జరిగింది. ఆ తరువాత అబ్దుల్ వహాద్ ఒవైసీ 1957 లో మజ్లిస్‌ను రాజకీయ పార్టీగా మార్చారు. దాని పేరు ప్రారంభంలో ఆల్ ఇండియా అని చేర్చారు. అబ్దుల్ వహాద్ ఒవైసీ.. పార్టీకి నూతన సిద్దాంతాలు రచించారు.
అబ్దుల్ వహాద్ ఒవైసీ తరువాత.. 1976లో అతని కుమారుడు సలావుద్దీన్ ఒవైసీకి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ బాధ్యతలు స్వీకరించారు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి. ఆయన 2004 వరకు వరుసగా ఆరుసార్లు హైదరాబాద్ ఎంపీగా ఉన్నారు. సలావుద్దీన్ ఒవైసీ తరువాత ఆ పార్టీ బాధ్యతలను సలావుద్దీన్ ఒవైసీ పెద్ద కుమారుడు అసదుద్దీన్ ఒవైసీకి అప్పగించగా.. అప్పటి నుంచి అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.
పొలిటికల్ ఏంట్రీ
అసదుద్దీన్ ఒవైసీ 2004లో తొలిసారిగా హైదరాబాద్ నుంచి లోక్‌సభ స్థానానికి పోటీ చేశారు. ఇప్పటి వరకు వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడిగా ఉన్నంత కాలం, AIMIM కేవలం మహారాష్ట్ర , కర్ణాటకలోని పలు ప్రాంతాలకు మాత్రమే వ్యాపించింది. కానీ, అసదుద్దీన్ ఒవైసీ చేతికి పార్టీ బాధ్యతలు వెళ్లగానే.. ఆ పార్టీకి తొలుత జాతీయ స్థాయిలో గుర్తింపుపై దృష్టి పెట్టారు. అసదుద్దీన్ ఒవైసీ క్రమంగా విజయం సాధించడం ప్రారంభించాడు. కొన్నేళ్లలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఫలితంగా బీహార్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల అసెంబ్లీలో AIMIMకి సీట్లు వచ్చాయి. అలాగే.. ఒవైసీ పార్టీని బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విస్తరించడం ప్రారంభించారు. నేటికీ అసదుద్దీన్ ఒవైసీ, ఆయన పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రాల్లో చురుకుగా ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీకి 2014 సంవత్సరానికి సంసద్ రత్న అవార్డు లభించింది, 15వ పార్లమెంట్ సెషన్‌లో మంచి పనితీరు కనబరిచారు. ఇది కాకుండా.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 500 మంది ముస్లింలలో అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ ప్రొఫైల్
- పేరు: అసదుద్దీన్ ఒవైసీ
- ముద్దుపేర్లు: నఖీబ్-ఇ-మిల్లాత్, ఖైద్,అసద్ భాయి
- వయస్సు: 53 సంవత్సరాలు
- పుట్టిన తేదీ: మే 13, 1969
- పుట్టిన ప్రదేశం: హైదరాబాద్
- విద్య: LLB
- కెరీర్: రాజకీయవేత్త, న్యాయవాది
- రాజకీయ పార్టీ: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
- ప్రస్తుత స్థానం: AIMIM అధినేత, ఎంపీ
- తండ్రి పేరు: సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ
- తల్లి పేరు: నజ్మున్నీసా బేగం
- భార్య పేరు: ఫర్హీన్ ఒవైసీ
- కూతుళ్ల పేర్లు: ఖుద్సియా ఒవైసీ, యాస్మిన్ ఒవైసీ, అమీనా ఒవైసీ, మహీన్ ఒవైసీ, అతికా ఒవైసీ.
- కొడుకు పేరు: సుల్లానుద్దీన్ ఒవైసీ
- శాశ్వత చిరునామా: H.No.8-15-130/AS/1, శాస్త్రిపురం, మైలార్‌దేవ్‌పల్లి, రంగారెడ్డి, తెలంగాణ
- Achievements
- Asaduddin Owaisi
- Asaduddin Owaisi Achievements
- Asaduddin Owaisi Age
- Asaduddin Owaisi Biography
- Asaduddin Owaisi children
- Asaduddin Owaisi education
- Asaduddin Owaisi house
- Asaduddin Owaisi life history
- Asaduddin Owaisi political carre
- Asaduddin Owaisi wife
- Asaduddin Owaisi's Age
- Assets
- Biography
- Caste
- Contact Address
- Educational Qualifications
- Family Background
- Latest News
- Photos
- Political Life
- Speech
- Videos