Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ లో ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్

ఉగ్రవాద సంస్థల్లో సానుభూతిపరులను చేర్చుకోవడానికి పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడ పన్నిందని తేలింది. సైబర్, మొబైల్ యాప్ ల సాయంతో ఉగ్రవాద సంస్థల్లో చేరిన 40 మంది సానుభూతిపరులను అరెస్టు చేయడంతో ఈ బండారం బయటపడింది. 

As security forces tighten noose, Pak-based terror groups resort to cyber recruitment in J-K: Officials
Author
Hyderabad, First Published Jan 4, 2021, 8:18 AM IST

ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు చేయని ప్రయత్నమంటూ లేదు. కాగా.. దీనిలో భాగంగా.. ఆన్ లైన్ లో కూడా రిక్రూట్ మెంట్  చేస్తున్నారట. ఈ విషయాన్ని భారత నిఘావర్గాలు గుట్టురట్టు చేశాయి. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాద సంస్థలు సానుభూతిపరులను ఆన్ లైన్ లో రిక్రూట్ మెంట్ చేసేందుకు పాక్ ఐఎస్ఐ నకిలీ వీడియోలను ఉపయోగిస్తుందని సాంకేతిక నిఘాలో వెల్లడైంది. ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ సాయంతో సైబర్, మొబైల్ అప్లికేషన్ల సహాయంతో కశ్మీర్ లో భావోద్వేగాలను రేకెత్తిస్తూ సానుభూతిపరులను చేర్చుకుంటుదని తేలింది.

సైబర్, మొబైల్ అప్లికేషన్ల సహాయంతో కశ్మీరీల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తూ ఉగ్రవాద సంస్థలు సానుభూతిపరులను చేర్చుకుంటున్నాయని గత ఏడాది భారత భద్రతాదళాలు, ఇంటెలిజెన్సు ఏజెన్సీల దర్యాప్తులో వెలుగుచూసింది. ఉగ్రవాద సంస్థల్లో సానుభూతిపరులను చేర్చుకోవడానికి పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడ పన్నిందని తేలింది. సైబర్, మొబైల్ యాప్ ల సాయంతో ఉగ్రవాద సంస్థల్లో చేరిన 40 మంది సానుభూతిపరులను అరెస్టు చేయడంతో ఈ బండారం బయటపడింది. జమ్మూకశ్మీరు లోయలో పాక్ ఐఎస్ఐ స్లీపర్ సెల్ లను బహిర్గతం కాకుండా ఉగ్రవాద సంస్థలు సైబర్, మొబైల్ అనువర్తనాలను ఎక్కువగా వినియోగిస్తుందని భద్రతాదళాల దర్యాప్తులో వెలుగుచూసింది. 

డిసెంబరు నెలలో రాష్ట్రీయ రైఫిల్ ముందు లొంగిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు తవార్ వాఘే, అమీర్ అహ్మద్ మీర్ లు కశ్మీరులో ఉగ్రవాద చేరికల వ్యవస్థ గురించి బయటపెట్టారు. లొంగిపోయిన ఉగ్రవాదులు తాము ఫేస్ బుక్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థను సంప్రదించామని చెప్పారు. తాము ఉగ్రవాద సంస్థలో చేరాక మహ్మద్ అబ్బాస్, ఖలీద్ అనే కోడ్ రిక్రూటర్లకు అప్పగించారని, వారు యూట్యూబ్ సహా పబ్లిక్ ప్లాట్ ఫాంలను ఉపయోగించి ఆన్ లైన్ లో శిక్షణ ఇచ్చారని లొంగిపోయిన ఉగ్రవాదులు చెప్పారు. 

పాక్ దేశానికి చెందిన బుర్హాన్ హమ్దా నుంచి తమకు ఆదేశాలు అందాయని ఉగ్రవాదులు వివరించారు. సోపోర్ లోని ఖవాజా గిల్ గట్ కు చెందిన ఫైనల్ ఈయర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అమీర్ సిరాజ్ కూడా ఆన్‌లైన్‌లో ఉగ్రవాదిగా నియమితుడయ్యాడు. గత నెలలో ఉత్తర కాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా సిరాజ్‌ హతమయ్యాడు. సిరాజ్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో ఆన్‌లైన్‌లో చేరాడని భద్రతాదళాల దర్యాప్తులో వెల్లడైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios