Asianet News TeluguAsianet News Telugu

Aryan Khan : కొడుకును చూడడానికి షారూఖ్ కు అనుమతి.. తండ్రిని చూసి బోరుమన్న ఆర్యన్ ఖాన్..

ఈ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను  కొట్టివేసిన ముంబై కోర్టు ఈనెల 7వ తేదీ వరకు అతనిని ఎన్సీపీ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది.  ఇదిలా ఉంటే తన కొడుకును కలవడానికి shah rukh khan కొద్ది రోజుల క్రితం అధికారుల అనుమతి కోరారు.  దీనికి ఎన్ సీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో లాకప్లో ఉన్న కొడుకును చూడడానికి వెళ్ళాడు షారుక్ ఖాన్.

Aryan Khan Breaks Down In Tears After Shah Rukh Khan Comes To Meet Him In NCB Custody
Author
Hyderabad, First Published Oct 6, 2021, 8:45 AM IST

ముంబై : డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు aryan khan ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్‌ షిప్‌పై అధికారులు మెరుపు దాడులు జరిపి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌తోపాటు, ఆర్యన్‌ ఖాన్‌తో సహా పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

ఈ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను  కొట్టివేసిన ముంబై కోర్టు ఈనెల 7వ తేదీ వరకు అతనిని ఎన్సీపీ కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది.  ఇదిలా ఉంటే తన కొడుకును కలవడానికి shah rukh khan కొద్ది రోజుల క్రితం అధికారుల అనుమతి కోరారు.  దీనికి ఎన్ సీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలో లాకప్లో ఉన్న కొడుకును చూడడానికి వెళ్ళాడు షారుక్ ఖాన్.

అయితే తండ్రి ని చూడగానే ఆర్యన్ బోరుమని ఏడ్చినట్లు మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. అలాంటి దుస్థితి చూసి తల్లడిల్లి పోయినట్లు సమాచారం.  అధికారులు రైడ్ చేసిన సమయంలో తన కొడుకు దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ లేకపోయినప్పటికీ అతడిని ఇలా లాకప్ లో పెట్టడానికి చూసి ఎంతగానో బాధ పడ్డాడట షారుఖ్ ఖాన్.

అరేబియా సముద్రంలో డ్రగ్స్‌తో క్రూయిజ్ షిప్.. ఎన్‌సీబీ అదుపులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు

కాగా క్రూయిజ్‌ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు చేసిన మెరుపుదాడిలో  13 గ్రాముల కొకైన్,  21 గ్రాముల చరాస్,  5 గ్రాముల  మెఫెడ్రోన్‌తోపాటు  కొన్ని పిల్స్ ను అలాగే రూ.1,33,000  నగదును స్వాధీనం చేసుకున్నారు.  ఆర్యన్ తో సహా మున్మున్‌ ధమేచా, అర్బాజ్‌ మర్చంట్‌, ఇస్మీత్‌ సింగ్‌, గోమిత్‌ చోప్రా, నూపుర్‌ సారిక, విక్రాంత్‌ చోకర్‌, మొహక్‌ జైస్వాల్‌ తదితరులను అరెస్టు చేశారు.

అక్టోబర్ 2 శనివారం నాటి రాత్రి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు   ఓ క్రూయిజ్ షిప్ లో డ్రక్స్ కనుగొన్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండడం సంచలనం సృష్టించింది. 

ఆర్యన్ ను మొదట అరెస్టు చేయలేదని, ఆయనపై అభియోగాలు మోపలేదని అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసులో ప్రశ్నించడానికి మాత్రమే  ఆర్యన్ ఖాన్ తో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  ఈ పార్టీ  ఎఫ్ టివి ఇండియా ఎండీ ఖషీఫ్ ఖాన్ పర్యవేక్షణలో జరిగినట్లు తెలిసింది. 

ముంబై నుంచి గోవా కి వెళ్లాల్సిన క్రూయిజ్ షిప్  అక్టోబర్ 2, శనివారం రాత్రి బయలుదేరింది. ఈ షిప్ మూడు రోజుల మ్యూజికల్ వోయేజ్ లో భాగంగా ముంబై నుంచి గోవాకు వెళ్లాల్సి ఉంది.  అయితే, ఈ షిప్ లో rave party నిర్వహించనున్నట్లు,  అందులో డ్రగ్స్ కూడా తీసుకునే అవకాశం ఉందని అధికారులకు పదిహేను రోజుల కిందటే సమాచారం అందింది. 

ఈ షిప్ లో ఢిల్లీ నుంచి ఒక బిజినెస్ మాన్ కూతురు,  మరో యువతి కూడా ఎక్కినట్లు తెలిసింది. వీరితో పాటు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నారు. ముంబై నుంచి క్రూయిజ్ షిప్ బయలుదేరి సముద్రంలోకి ప్రవేశించాక ప్రయాణికులు కొందరు బ్యాగులో నుంచి డ్రగ్స్ తీసుకున్నారని సమాచారం.

ఈ వ్యవహారంపై సమాచారం ఉన్న  ఎన్ సిబి అధికారులు  కూడా ప్యాసింజర్ల  లాగానే టికెట్లు తీసుకుని షిప్ లోకిఎంటర్ అయ్యారు.  సముద్రంలోకి వెళ్లి drugs తీసుకోగానే అధికారులు యాక్షన్ లోకి దిగారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు.  కెప్టెన్ దగ్గరకు వెళ్లారు వెంటనే వెనక్కి తీసుకెళ్లాలని ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios