న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మంగళవారం నాడు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. మూడు రోజులుగా ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఇవాళ పరీక్షలు చేయించుకొన్నారు.

ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఈ తరుణంలో మూడు రోజులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతతో ఉన్నారు. జలుబు, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు.

దీంతో కేజ్రీవాల్ కరోనా పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. సీఎం ఇంటి వద్దనే వైద్యులు ఆయన నుండి శాంపిల్స్ సేకరించారు.
ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికి ఈ శాంపిల్స్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. 

also read:ప్రపంచంలో కరోనా కేసుల పెరుగుదలపై డబ్ల్యుహెచ్ఓ వార్నింగ్

ఆదివారం నాటి నుండి కేజ్రీవాల్ అధికారులతో సమీక్షలు నిర్వహించలేదు. అంతేకాదు ఎవరిని కూడ ఆయన కలవలేదు. ఇంట్లోనే ఆయన ఐసోలేషన్ లో ఉన్నట్టుగా గడిపాడు. జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని సోమవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.

అస్వస్థత కారణంగానే కేజ్రీవాల్ సోమవారం నాడు తన మీటింగ్ లను రద్దు చేసుకొన్నారు.  కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారని ఇవాళ కరోనా పరీక్షలు నిర్వహించుకొంటారని కూడ ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవాళ కేజ్రీవాల్ నుండి వైద్యులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. రిపోర్టు కోసం వేచి చూస్తున్నారు.