Asianet News TeluguAsianet News Telugu

'ప్రజాస్వామ్యంతోనా..ప్రధాని మోడీతోనా.. అనేది కాంగ్రెస్ తేల్చుకోవాలి' : కేజ్రీవాల్  

కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ విషయంలో ఢిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలు కేజ్రీవాల్‌కు మద్దతివ్వడానికి ఇష్టపడటం లేదు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంతోనేనా, ప్రధాని మోదీతోనా అనేది కాంగ్రెస్ తేల్చుకోవాలని అన్నారు.

Arvind Kejriwal To Congress Decide If Youre With Democracy Or PM Modi krj
Author
First Published Jun 3, 2023, 4:14 AM IST

ఢిల్లీలో పరిపాలనా సేవలను నియంత్రించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను కలిశారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీపై తన అభిప్రాయాన్ని ఉంచుతూ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, 140 కోట్ల మంది ప్రజలతో ఉంటుందా? లేదా ప్రధాని మోడీతో ఉంటుందా ? అనేది నిర్ణయించుకోవాలని అన్నారు.

ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరుతూ..

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరడానికి కేజ్రీవాల్ మే 23 నుండి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ తేజస్వీ యాదవ్‌లను కలిశారు. తాజాగా జార్ఖండ్ మద్దతు ప్రకటించింది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీకి జార్ఖండ్ మద్దతు లభించింది

హేమంత్‌ సోరెన్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. గత నెలలో ఢిల్లీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని కేజ్రీవాల్‌ అన్నారు. వారిని అవమానించారు. ప్రజాస్వామ్య హక్కులు హరించబడ్డాయని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని మే 11న చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ దురదృష్టవశాత్తు మే 19న ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఉత్తర్వును దాటేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలి: కేజ్రీవాల్

ఢిల్లీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వం పని చేయనివవ్వడం లేదని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు పార్లమెంటుకు వెళ్లనుంది. లోక్‌సభలో బిజెపికి మెజారిటీ ఉంది. అయితే రాజ్యసభలోని 238 సీట్లలో 93 మాత్రమే. కాబట్టి బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే ఈ బిల్లును ఓడించవచ్చని అన్నారు. ఇది ఒక్క ఢిల్లీకే కాదు.. యావత్ దేశానికి సంబంధించిన విషయమని అన్నారు.

ఢిల్లీ తరువాత పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ లేదా తమిళనాడులల్లో బీజేపీ ఇలాంటి ఆర్డినెన్స్ లను తీసుకురావచ్చుననీ, ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను లాక్కోవడం ప్రజాస్వామ్యం కాదనీ,  రాజ్యాంగాన్ని తారుమారు చేయడమేనని, ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా నిలబడాలన్నారు. దేశం నలుమూలల నుంచి మాకు సహకారం అందుతోందన ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా.. జార్ఖండ్ రాష్ట్ర చీఫ్ హేమంత్ సోరెన్ కృతజ్ఞతలు తెలుపుతూ కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతిచ్చినందుకు హేమంత్ సోరెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అప్రజాస్వామిక ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ముందుకు రావాలని ఇతర పార్టీలకు పిలుపునిచ్చారు.

ఇది ప్రజాస్వామ్య పునాదిపై దాడి. ఎన్నికైన ప్రభుత్వాలను దించే విధానం, ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే విధానంలో మనందరం ఏకతాటిపైకి రావాలని అన్నారు. ఈ తరుణంలో ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ వైఖరిపై విలేఖరుల ప్రశ్నకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈ రోజు కాంగ్రెస్ ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగంతో, దేశంలోని 140 కోట్ల ప్రజలతో ఉంటుందో .. లేదా మోడీతో కలిసి ఉంటుందో నిర్ణయించుకోవాలి” అని కాంగ్రెస్ ను ప్రశ్నించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios