Asianet News TeluguAsianet News Telugu

డిల్లీ లిక్కర్ స్కాం: అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లైను  ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. 

Arun Ramachandra pillai  arrests  ED in Delhi  liquor scam
Author
First Published Mar 7, 2023, 9:50 AM IST


హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో   అరుణ్ రామచంద్ర పిళ్లైని  ఈడీ అధికారులు  అరెస్ట్  చేశారు.  రెండు రోజలు గా  ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైను ప్రశ్నిస్తున్నారు.   సోమవారం నాడు రాత్రి  అరుణ్ రామచంద్రపిళ్లైని  అరెస్ట్  చేసినట్టుగా  ఈడీ ప్రకటించింది.  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఇప్పటికే  11 మంది అరెస్టయ్యారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈడీ, సీబీఐలు  లోతుగా దర్యాప్తు  చేస్తున్నాయి.ఈ కేసులో     రెండు తెలుగు రాష్ట్రాలకు  చెందిన పలువురిని  దర్యాప్తు సంస్థలు  అరెస్ట్  చేశాయి.  శరత్ చంద్రారెడ్డి,  అభిషేక్ బోయినపల్లి,  బుచ్చిబాబు,  మాగుంట రాఘవరెడ్డి  వంటి వారిని  ఇప్పటికే  దర్యాప్తు సంస్థలు  అరెస్ట్  చేశాయి. తాజాగా  అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్  చేశాు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో   సీబీఐ  అధికారులు తొలుత  అరుణ్ రామచంద్ర పిళ్లైపై   అభియోగాలు  నమోదు  చేశారు.   ఈ విషయమై  హైద్రాబాద్ కేంద్రంగా   పలు దఫాలు సోదాలు నిర్వహించారు.అరుణ్ రామచంద్ర పిళ్లైకి చెందిన  సంస్థలు,  ఇళ్లు, కార్యాలయాల్లో  సోదాలు  నిర్వహించిన  సమయంలో  కీలక సమాచారాన్ని  దర్యాప్తు  సంస్థలు సేకరించాయి.  ఈ కేసులో  దాఖలు  చేసిన  చార్జీషీట్లలో  అరుణ్ రామచంద్రపిళ్లై  పేరును కూడా  దర్యాప్తు సంస్థలు  ప్రస్తావించాయి.

అరుణ్ రామచంద్రపిళ్లైకి  చెందిన  ఆస్తులను  ఈడీ అధికారులు  అటాచ్డ్  చేస్తున్నట్టుగా   ప్రకటించింది..  హైద్రాబాద్  శివారులోని  రెండు కోట్ల  విలువైన  భూమిని  ఈడీ అధికారులు  అటాచ్డ్ చేస్తున్నట్టుగా  ఈడీ తెలిపింది.

అరుణ్ రామచంద్రపిళ్లై   కొందరికి బినామీగా వ్యవహరించినట్టుగా  దర్యాప్తు సంస్థలు అనుమానాలు వ్యక్తం  చేస్తున్నాయి.ఈ  దిశగా  దర్యాప్తు సంస్థలు  విచారణ  చేస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.  ఈ దిశగా  విచారణ  సాగుతుంది.  ఇప్పటికే  అరెస్టైన వారిలో  తెలుగు రాష్ట్రాలకు  చెందినవారే ఎక్కువగా  ఉన్నారు.  

also read:కవితను అరెస్ట్ చేస్తారని భయం కేసీఆర్‌కు పట్టుకుంది: విజయశాంతి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  పేరు కూడా  ఉంది.ఈ విషయమై  ఇప్పటికే  160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద  సీబీఐ అధికారులు  కవితను  ప్రశ్నించిన విషయం తెలిసిందే.  గత మాసంలో  దాఖలు  చేసిన  రెండో చార్జీషీట్ లో  కవిత  పేరును కూడా దర్యాప్తు సంస్థలు  ప్రస్తావించాయి.  కవితతో  పాటు ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్,   ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీష్ సిసోడియా పేర్లు కూడా చేర్చిన విషయం తెలిసిందే.  వారం రోజుల క్రితం  మనీష్ సిసోడియాను  సీబీఐ  అధికారులు అరెస్ట్  చేశారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios