ముంబై:మహారాష్ట్రలో కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ అందక కరోనా రోగి భార్య ఒడిలో మృతి చెందాడు.  ఈ ఘటన  సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా చాంద్వార్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.  

చాంద్వాడ్ కు చెందిన  అరున్ మాలికి కరోనా సోకింది. దీంతో  ఆయన శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. దీంతో ఆయనను భార్య ఆసుపత్రికి తీసుకొచ్చింది. అయితే ఆసుపత్రిలో బెడ్స్ లేవు, ఆక్సిజన్  పెట్టాలని అరుణ్ భార్య ఆసుపత్రి సిబ్బందిని కోరింది. ఆసుపత్రి సిబ్బంది  ఆక్సిజన్ పెట్టలోపుగా అరుణ్ ఆసుపత్రి ఆవరణలోనే భార్య ఒడిలో ఉండగానే  ఆయన కన్నుమూశాడు.

దీంతో ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంకర్ లీకై 24 మంది రోగులు మరణించిన విషయం తెలిసిందే.  రాషట్రంలో కరోనా కేసుులు అత్యధికంగా నమోదౌతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ను కూడ ప్రకటించింది.