Asianet News TeluguAsianet News Telugu

ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన ముస్లిం నేత‌ల‌ను అరెస్టు చేయండి - సుప్రీంకోర్టులో రైట్ వింగ్ గ్రూప్స్..

దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించిన హరిద్వార్, ఢిల్లీలో మతపరమైన ద్వేషపూరిత ప్రసంగాలకు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్లను వ్య‌తిరేకిస్తూ రెండు మితవాద గ్రూపులు సుప్రీంకోర్టులో కౌంటర్ అప్పీళ్లను దాఖలు చేశాయి.

Arrest Muslim Leaders Who Made Hate Speech - Right Wing Groups in Supreme Court ..
Author
Delhi, First Published Jan 23, 2022, 9:56 AM IST

దేశవ్యాప్తంగా ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించిన హరిద్వార్, ఢిల్లీలో మతపరమైన ద్వేషపూరిత ప్రసంగాలకు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్లను వ్య‌తిరేకిస్తూ రెండు మితవాద గ్రూపులు సుప్రీంకోర్టులో కౌంటర్ అప్పీళ్లను దాఖలు చేశాయి. ఈ కేసులో తమను భాగస్వాములను చేయాలని ఇరు సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.

విద్వేషపూరిత ప్రసంగాలకు చేసిన వారికి బ‌దులు.. హిందువుల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడిన ముస్లిం నేతలను అరెస్టు చేయాలని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా విజ్ఞప్తిలో డిమాండ్ చేశారు. ధరమ్ సన్సద్‌లో మత పెద్దలు చేసిన ప్రకటనలు హిందువేతరులు హిందూ సంస్కృతిపై చేస్తున్న కౌంట‌ర్ ఇచ్చేలా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వాటిని ‘‘ద్వేషపూరిత ప్రసంగం’’గా వర్ణించలేమని విజ్ఞప్తి చేసింది.
‘‘హిందూ  ఆధ్యాత్మిక నాయకులను అపకీర్తికి గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ద్వేశపూరిత వ్యాఖ్య‌లు చేశారంటూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయ‌న హిందూ ధర్మ్ సన్సద్ (sic)కి సంబంధించిన వ్యవహారాలు, కార్యకలాపాలపై అభ్యంతరాలు లేవనెత్తకూడదు’’ అని కోరారు. ఈ పిటిషన్ దాఖలు చేసిన జర్నలిస్ట్ ఖుర్బాన్ అలీ దేశంలో ఆగ్రహాన్ని రేకెత్తించిన మతపరమైన వేదికలపై ప్రసంగాలకు వ్యతిరేకంగా అప్పీల్ లో పేర్కొన్నరని తెలిపారు. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, వారిస్ పఠాన్ వంటి ఇతర ముస్లిం నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు ద్వేషపూరిత ప్రసంగాలు ఇస్తున్నారని ఆరోపించారు.

ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించినందున, హిందువులపై విద్వేషపూరిత చేసిన ప్రసంగాలను కూడా పరిశీలించాలని హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే మరో సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అప్పీల్ లో పలువరు ముస్లిం నాయకులు హిందువులపై ద్వేషపూరిత ప్రసంగాల చేసిన 25 సందర్భాలను ఉదహరణగా పేర్కొన్నారు. 

అయితే, హరిద్వార్ ఢిల్లీలో ముస్లింలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ ఖుర్బాన్ అలీ, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాష్ అప్పీల్ దాఖలు చేశారు. అలాగే సాయుధ దళాలకు చెందిన ఐదుగురు మాజీ చీఫ్‌లు, బ్యూరోక్రాట్‌లు, ప్రముఖ పౌరులతో సహా వంద మందికి పైగా ఇతర వ్యక్తులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీకి ‘‘భారత ముస్లింల మారణహోమానికి బహిరంగ పిలుపు’’ వ్యాఖ‌ల విషయంలో లేఖ రాశారు. వారిని రక్షించాలని పిలుపునిచ్చారు. 

జనవరి 12వ తేదీన ఈ విద్వేష‌పూరిత వ్యాఖ్యల విష‌యంలో తీసుకున్న చర్యలను వివరించాలని కోరుతూ సుప్రీంకోర్టు.. కేంద్రం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు ఈ కేసులో యతి నర్సింహానంద్, జితేంద్ర నారాయణ్ త్యాగిని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios