రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం రాయ్‌గడ్ పోలీసులు ఆర్నబ్ గోస్వామిని  అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  దీనిమీద కంగనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఒక వీడియోను తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

దీంట్లో మీరు ఎంతమంది నోళ్లు మూయిస్తారు? ఎన్ని ఇళ్లు కూలగొడతారు? ఎన్ని గొంతులు నొక్కేస్తారు ? సోనియా సేనా మీరు ఎంతమందిని మీరు ఆపగలరు? ఈ గొంతులు పెరుగుతూనే ఉంటాయి. ఈ వీడియోకు "మహారాష్ట్ర ప్రభుత్వానికి సందేశం" అని పేరు పెట్టి కంగనా ట్వీట్ చేసింది.

రాహుల్ ను పప్పు సేనా అంటే కోపం వస్తుందా అంటూ సోనియాగాంధీమీద, రాహుల్ గాంధీ మీద విరుచుకుపడింది.  ఆర్నబ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘వాళ్లు మీ జుట్టుపట్టి లాగి మీ మీద దాడి చేస్తే చేయనీయండి. స్వేచ్ఛకు మూల్యం చెల్లించాల్సిందే. మాట్లాడే స్వేచ్ఛను వారు సంకెళ్లు వేస్తున్నారు. స్వేచ్ఛా వ్యాఖ్యాన్ని వారు చిరునవ్వుతో ఉరి తీస్తున్నారు’ అంటూ సందేశం ఇచ్చింది. 

రెండేళ్ల క్రితం 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పురిగొల్పాడనే ఆరోపణతో అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ ఆర్కిటెక్ట్, అతని తల్లి 2018 లో ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు.

జీ మీడియాతో మాట్లాడుతూ సిఐయు ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే మాట్లాడుతూ అర్నాబ్‌ను ఐపిసి సెక్షన్ 306, సెక్షన్ 34 కింద అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు తనపై శారీరకంగా దాడి చేశారని అర్నాబ్ గోస్వామి పేర్కొన్నారు. రిపబ్లిక్ టివి 10 మంది పోలీసులు అర్నాబ్ ఇంట్లోకి ప్రవేశించి "అర్నాబ్ బయటకు రావాలని డిమాండ్ చేస్తూ నెట్టివేసారు" అని నివేదించింది.

ఈ కేసుకు సంబంధించి మరింత విచారణ కోసం అర్నాబ్ గోస్వామిని రాయ్‌గడ్‌కు తీసుకెళ్తారని భావిస్తున్నారు.