Asianet News TeluguAsianet News Telugu

Honey Trap : కాన్పూర్ లో ఆర్మీ అధికారిపై హనీట్రాప్ !

ఆర్మీ అధికారితో శారీరక సంబంధం పెట్టుకున్న కాన్పూర్ మహిళ అశ్లీల వీడియోలు, ఛాయా చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేసింది. ఆర్మీ అధికారి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసిన మహిళ, తర్వాత ఆస్తిలో కొంత భాగాన్ని తనకు బదిలీ చేయమని డిమాండ్ చేస్తోంది. 

Army physiotherapist 'honey trapped' by Kanpur woman on Instagram, blackmailed with obscene video in UP
Author
Hyderabad, First Published Sep 21, 2021, 10:36 AM IST

ఉత్తరప్రదేశ్ : కాన్పూర్ నగరానికి చెందిన ఓ మహిళ శ్రీనగర్ బేస్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ ఆర్మీ ఆఫీసర్ (Army Officer) కు హనీట్రాప్ (Honey Trap) వేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం ఒడిశా(Odisha)లోని సైనిక ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఓ ఆర్మీ అధికారికి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ (Kanpur) జిల్లాకు చెందిన ఒక మహిళ ఇన్ స్టాగ్రామ్  ద్వారా పరిచయం అవ్వడంతో ఆమెతో స్నేహం చేశాడు. 

కాన్పూర్ కు చెందిన ఓ  మహిళ ఆర్మీ అధికారితో శారీరక సంబంధం పెట్టుకుంది. తాము క్లోజ్ గా ఉన్న అన్ని సందర్బాల్నీ, ఫొటోలు, వీడియోల రూపంలో రికార్డు చేసి పెట్టింది. వీటితో అశ్లీల వీడియోలు, ఛాయా చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. ఇలా ఆర్మీ అధికారి నుంచి రూ. 10 లక్షలు వసూలు చేసింది. అంతటితో ఊరుకోని ఆ మహిళ, తర్వాత ఆస్తిలో కొంత భాగాన్ని తనకు బదిలీ చేయమని డిమాండ్ చేస్తోంది. ఎరక్క పోయి ఇరుక్కుపోయానని లబో దిబో మంటున్న ఆర్మీ అధికారి.. దీన్నుండి ఎలా బయటపడాలో తెలీక తల పట్టుకున్నాడు. విషయాన్ని తన బంధువుతో చెప్పాడు. దీంతో ఆర్మీ అధికారి బంధువు కాన్పూర్ మహిళ హనీట్రాప్, బ్లాక్ మెయిల్ బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

బాధితుడైన ఆర్మీ అధికారి ప్రస్తుతం సెలవులో ఫిరోజాబాద్ నగరంలోని సిర్సాగంజ్ లోని అత్తవారింట్లో ఉంటున్నాడు. ఫిజియోథెరపిస్ట్ తండ్రి కూడా సైన్యంలోనే పనిచేస్తున్నారు. కాన్పూర్ మహిళ తండ్రి కూడా ఈ బ్లాక్ మెయిలింగ్ లో పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు హనీట్రాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios