పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్‌లో ఓ ఆర్మీ అధికారి తన భార్యను షూట్ చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యకు తానే హానీ తలపెడుతున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తన భార్యను చంపేశాడు. 

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్‌లో ఓ టాప్ ఆర్మీ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. అంతకు ముందు ఆయన తన భార్యను షూట్ చేశాడు. అనంతరం, ఓ సూసైడ్ నోట్ రాసి తననూ షూట్ చేసుకున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫెరోజ్‌పూర్‌లోని కంటోన్‌మెంట్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనను పంజాబ్ పోలీసులు, ఆర్మీ దర్యాప్తు చేస్తున్నది.

పోలీసుల వివరాల ప్రకారం, 44 ఏళ్ల ఆర్మీ అధికారి.. 42 ఏళ్ల భార్యను తలలో కాల్చేశాడు. ఫెరోజ్‌పూర్ కంటోన్‌మెంట్‌లోని తమ నివాసంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి 9.15 గంటల సమయంలో తన భార్యను చంపేసి ఉంటాడని పోలీసులు సోమవారం తెలిపాడు. అనంతరం, ఆ ఆర్మీ అధికారి యూనిట్ క్వార్టర్ గార్డ్‌లోని ఆలయానికి వెళ్లాడు. అక్కడే తనను కూడా షూట్ చేసుకుని మరణించాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఆలయంలో విగత జీవిగా కనిపించిన ఆ ఆర్మీ అధికారి గురించి వెంటనే ఆయన భార్యకు చెప్పడానికి ప్రయత్నించారు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్వీకరించలేదు. దీంతో ఆమె ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లిన వారు కూడా షాక్ అయ్యారు. అక్కడ ఆమె రక్తపు మడుగులో ప్రాణాలు విడిచిన స్థితిలో కనిపించింది.

Also Read: ఎన్ కౌంటర్ కు ముందు.. టెర్రరిస్టుకు వీడియోకాల్ చేసిన ఆర్మీ అధికారి.. అతనేమన్నాడంటే..

ఆ ఆర్మీ అధికారి ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సూసైడ్ నోట్‌లో తానే తన భార్యకు గాయం చేసినట్టు రాసి ఉన్నది. 

దీనిపై ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. వైవాహిక సంబంధంలో ఓ వివాదం నేపథ్యంలో తన భార్యను చంపేసినట్టు అధికారి పేర్కొన్నారు. వైవాహిక సంబంధాల్లో సమస్యలపై వారిద్దరూ కౌన్సెలింగ్‌కు వెళ్లుతున్నట్టు ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వివరించారు.

ఆ ఆర్మీ అధికారి హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారు. కాగా, ఆయన భార్య పొరుగు రాష్ట్ర ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూనన్‌ నివాసి. వారి మృతదేహాలను ఫెరోజ్‌పూర్ సివిల్ హాస్పిటల్‌కు పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే, పోస్టింగ్ మూలంగతా వారు పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్‌లో ఉన్నారు.