Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ ఆదేశాలతో భారత ఆర్మీ అక్కడికి వెళ్లలేదు కాదా.. : మంత్రి జైశంకర్

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత సైన్యం, చైనా సైనికుల మధ్య వాగ్వివాదం జరిగినప్పటి నుంచి దేశ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడుతూ..2020 నుండి వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి చైనా అధిక సంఖ్యలో సైన్యాన్ని మోహరించిందని, వారికి దీటుగా సమాధానం చెప్పడానికి భారత్ కూడా భారీ ఎత్తున బలగాలను మోహరించిందని తెలిపారు. 

Army not at LAC on Rahul Gandhi orders: EAM Jaishankar on Congress MP China barb
Author
First Published Dec 19, 2022, 3:17 PM IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత సైన్యం, చైనా సైనికుల మధ్య వాగ్వివాదం జరిగినప్పటి నుంచి దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఈ విషయమై  అధికార బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రంగంలోకి దిగి..  కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దీటుగా సమాధానమిచ్చారు. చైనా దురాక్రమణకు ప్రతిస్పందించడానికి, ఎల్‌ఎసిపై భారత సైన్యం భారీ ఎత్తున మోహరించిందని అన్నారు. తవాంగ్‌లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణను అణిచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. 

ఇండియా టుడే నిర్వహించిన ఇండో-జపాన్ కాన్‌క్లేవ్ 2022లో మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వారసుడి పేరును ప్రస్తావించకుండా జైశంకర్ ఇలా స్పందించారు. “ కొంతమంది విషయాలు చెబుతారు. అవి నమ్మదగినవి కాకపోవచ్చు, కొన్నిసార్లు వారి స్వంత స్థానాలకు, వారి స్వంత ప్రవర్తనకు విరుద్ధంగా ఉండవచ్చు. అని అన్నారు. 2020 నుండి భారీగా పెరిగిన చైనా చొరబాట్లను అధికమించడానికి సరిహద్దులో భారత సైనికుల మోహరింపు ఆల్ టైమ్ హైలో ఉందని జైశంకర్ వివరించాడు. ప్రధాని మోడీ ఆదేశించినందుకే ఆర్మీ అక్కడికి వెళ్లిందనీ అన్నారు.వాస్తవ నియంత్రణ రేఖ (LAC)ని ఏకపక్షంగా మార్చడానికి తాము చైనాను అనుమతించమని మంత్రి జైశంకర్ నొక్కి చెప్పారు.

రాహుల్ వాదన నమ్మశక్యంగా లేదు

చైనా సమస్యపై భారత ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, రాహుల్ గాంధీ వాదన నమ్మశక్యంగా లేదని విదేశాంగ మంత్రి అన్నారు. నిజానికి భారత్-చైనా సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని రాహుల్ గాంధీ ఇటీవల అన్నారు. తాజాగా జరిగినది కేవలం వాగ్వివాదమే కాదు, పూర్తి స్థాయి యుద్ధానికి చైనా సిద్ధమైంది. ఈ ముప్పును కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టాలని చూస్తోందని, అయితే ఇది ఎక్కువ కాలం సాగదని అన్నారు.

రాహుల్ గాంధీ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. రాహుల్ గాంధీ చైనా, పాకిస్థాన్ భాషల్లో మాట్లాడుతున్నారని, ఆయన సైన్యానికి, దేశానికి క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ నాయకుడు దేశానికి ఇబ్బందిగా మారారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మరోవైపు..రాహుల్ గాంధీ ఆరోపణలను రెట్టింపు చేసి.. బిజెపి ప్రభుత్వంపై తీవ్ర దాడికి దిగాడు.అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎల్‌ఎసి వెంబడి భారత్-చైనా ముఖాముఖిపై పిఎం మోడీ సమాధానం చెప్పాలని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా రాహుల్ గాంధీపై ఘాటుగా స్పందించారు. తవాంగ్ అంశంపై ప్రశ్నించే ముందు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ గురించి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నాయా ? అని ఠాకూర్ ప్రశ్నించారు. ఠాకూర్ అంతటీతో  ఆగకుండా.. డోక్లాంలో చైనా సైనికులతో భారత సైన్యం పోరాడుతున్నప్పుడు, చైనా అధికారులతో రాహుల్ గాంధీ ఉన్నారని అన్నారు.

తవాంగ్‌లో భారత్-చైనాల ఘర్షణ

డిసెంబర్ 9న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు. ఘర్షణ తర్వాత వెంటనే ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. జూన్ 2020లో లడఖ్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య తొలి ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ అనంతరం పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చైనా దళాలు LAC వెంట యథాతథ స్థితిని "ఏకపక్షంగా" మార్చడానికి ప్రయత్నించాయని , అయితే భారత సైన్యం వారిని సమర్థవంతంగా ఎదుర్కొందని, వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టిందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios