ఇటీవల సంచలనం సృష్టించిన మేజర్ భార్య శైలజా ద్వివేది హత్య వెనుక విస్తుగొలిపే నిజాలు బయటకువస్తున్నాయి. శైలజా ద్వివేదితో నిందితుడు నిఖిల్ హుండా కి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

 2015లో నాగాలాండ్ ఆర్మీ క్యాంపులో పనిచేస్తున్నపుడు శైలజను తన కామన్ స్నేహితుడి ద్వారా ఫేస్‌బుక్ టైమ్ లైన్ లో చూసి ఆమె అందానికి ముగ్దుడై స్నేహం చేశానని మేజర్ నిఖిల్ హండా పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడించారు. తాను ముందుగా శైలజ భర్త అయిన తన తోటి మేజర్ అమిత్ ద్వివేదితో స్నేహం చేసి, తరచూ అతని ఇంటికి విందుల పేరిట వెళ్లి శైలజతో వివాహేతర సంబంధం పెట్టుకున్నానని హండా పోలీసులకు చెప్పారు. 

తన భార్యతో విబేధాలున్నాయని శైలజకు హండా  అబద్ధం చెప్పి ఆమెను తన వైపు తిప్పుకునేందుకు యత్నించాడు. భర్త అమిత్ కు విడాకులు ఇచ్చేస్తే తామిద్దరం కొత్తజీవితం ప్రారంభిద్దామని హండా శైలజకు చెప్పినట్లు తేలింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగించనందుకే శైలజ ద్వివేదిని హత్య చేసినట్టుగా నిందితుడు మేజర్‌ నిఖిల్‌ రాయ్‌ హండా పోలీసులకు వివరించాడు. తనను పెళ్లి చేసుకోవాలని హండా శైలజను వెంటాడి వేధించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

అంతేకాదు.. గత 6నెలల్లో  హుడా... శైలజా ద్వివేదికి 3,300 సార్లు ఫోన్ కాల్స్.. 1500 మెసేజ్ లు చేసినట్లు సమాచారం. శైలజ హత్య జరిగడానికి ముందు రోజు రాత్రి హుడాకి తన భార్యతో గొడవైనట్లు తెలుస్తోంది. శైలజతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై హుడాని అతని భార్య ప్రశ్నించగా.. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వివాదం చోటుచేసుకుంది.

ఈ గొడవ తర్వాతే హుడా.. శైలజను బయట కలవాల్సిందిగా కోరాడు. భార్యకు విడాకులు ఇచ్చేసి శైలజను వివాహం చేసుకోవాలని భావించాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడం వల్లే హత్య చేసినట్లు నిఖిల్ హుడా పోలీసులకు వివరించాడు.