హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా ధర్మశాల కంటోన్మెంట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. తోటి జవాన్లతో గొడవపెట్టుకున్న జవాన్ జస్విర్ సింగ్ క్షణికావేశంలో ఆ ఇద్దర్నీ పొట్టనపెట్టుకున్నాడు. 18 సిక్ రెజిమెంట్ జవాను జస్విర్ సింగ్ విధులు ముగించుకుని తన క్వార్టర్ కు చేరుకున్నాడు.
హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా ధర్మశాల కంటోన్మెంట్ వద్ద దారుణం చోటు చేసుకుంది. తోటి జవాన్లతో గొడవపెట్టుకున్న జవాన్ జస్విర్ సింగ్ క్షణికావేశంలో ఆ ఇద్దర్నీ పొట్టనపెట్టుకున్నాడు. 18 సిక్ రెజిమెంట్ జవాను జస్విర్ సింగ్ విధులు ముగించుకుని తన క్వార్టర్ కు చేరుకున్నాడు. ఇంటి దగ్గర తోటి జవాన్లు హవల్ దార్ హర్దీప్ సింగ్, నాయక్ హర్పాల్ సింగ్ లతో గొడవ పడ్డాడు. ఈ వివాదంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జస్విర్ సింగ్ తుపాకీతో తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో హవల్దార్ హర్దీప్ సింగ్, నాయక్ హర్పాల్ సింగ్ లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లు చనిపోయారని గుర్తించిన జస్విర్ సింగ్ తాను అదే తుపాకీతో కాల్పుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మిలటరీ అధికారులతోపాటు పోలీసులు విచారణ చేపట్టారు. మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మధ్య చెలరేగిన గొడవే ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
జస్విర్ సింగ్ ఏడాదిన్నర క్రితం ఆర్మీలో చేరారని కల్నల్ నవదీప్ బ్రార్ తెలిపారు. హార్దిప్ సింగ్ 23 ఏళ్లుగా, హర్పాల్ సింగ్ 18 ఏళ్లుగా ఆర్మీలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
కల్నల్ నవదీప్ బ్రార్ తెలిపారు.
