Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ డైరెక్టర్ మీద కాల్పులకు తెగబడ్డ ఆర్మీ జవాన్.. కూతురును కొట్టారని కోపంతో..

homework చేయకపోవడంతో టీచర్ ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఈ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు గుర్జార్ పాఠశాల డైరెక్టర్ ను కలిసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ తరువాత గుర్జార్ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తీసి పాఠశాల డైరెక్టర్ మీద ఎక్కుపెట్టాడు.

Army jawan fires at school director as teacher slaps his daughter in rajasthan
Author
Hyderabad, First Published Jan 5, 2022, 7:58 AM IST

రాజస్థాన్ : హోం వర్క్ చేయనందుకు కూతురును టీచర్ కొట్టడంతో Army jawan ఊగిపోయాడు. ఈ క్రమంలో ఏకంగా school director పైనే కాల్పులు జరిపాడు. రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కన్వాడా గ్రామానికి చెందిన సైనికుడు పప్పు గుర్జార్ కుమార్తె ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. 

homework చేయకపోవడంతో టీచర్ ఆమెను చెంపదెబ్బ కొట్టింది. ఈ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు గుర్జార్ పాఠశాల డైరెక్టర్ ను కలిసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ తరువాత గుర్జార్ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్ తీసి పాఠశాల డైరెక్టర్ మీద ఎక్కుపెట్టాడు.

ఆ తరువాత కాల్పులు జరిపాడు. ఇంతలో గొడవ ఆపేందుకు మధ్యలోకి వచ్చిన గుర్జార్ భార్య భుజానికి ఆ తూటా తగిలింది. అనుకోని ఈ పరిణామానికి జవాన్ వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. 

Sindhutai sapkal: "అనాథ పిల్ల‌ల అమ్మ" సింధుతాయ్‌ సప్కాల్ ఇక‌లేరు..

ఇలాంటి ఘటనే జనవరి 3న జరిగింది. uttarpradesh లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన ఓ doctorని షూట్ చేసిన నేరం కింద ఇద్దరు యువకులను పోలీసులు arrest చేశారు. డాక్టర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై డాక్టర్ ప్రయాణిస్తున్న సమయంలో నిందితులు firing జరిపారు. ప్రధాన నిందితుడు బాధితుడిని నకిలీ డాక్టర్ అంటూ ఆరోపణలు చేశాడు. ఈ ఉదంతంపై పోలీసులు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు. 

నంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేఖుపుర గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు సల్మాన్, అతని భార్యకు వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఐతే చికిత్స పొందుతూ అతని భార్య ప్రాణాలు కోల్పోవడంతో, కోపోద్రిక్తుడైన సల్మాన్ అదును చూసి అతని బార్యకు వైద్యం చేసిన డాక్టర్ తిలక్ రామ్ మీద హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కాగా, ఈ విషయం మీద పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ధరమ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. నంగల్ పోలీస్ స్టేషన్ లోని షేకుపురా గ్రామానికి చెందిన ఫార్మసిస్ట్ డాక్టర్ తిలక్ రామ్ ను డిసెంబర్ 30న సాయంత్రం సల్మాన్, మెహబూబ్ అనే మరో వ్యక్తితో కలిసి డాక్టర్ మీద కాల్పులు జరిపారు. గాయాలపాలైన డాక్టర్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ కేసులో నిందితులైన సల్మాన్, మెహబూబ్ ల మీద బాధితుడి సోదరుడు కాల్పుల కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios