ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించి ఒకరోజు ముందుగానే  సెప్టెంబర్ 30న ఇంటికి వచ్చేశాడు. తీరా ఆమె మరొకరితో అభ్యంతరకరంగా కనిపించడంతో షాక్‌ అయ్యాడు.

తన భార్యతో ఉన్న ఆమె ప్రియుడిని ఓ జవాన్ హత్య చేసిన సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. కాగా.. పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే...నిందితుడు సురేశ్ కుమార్ జమ్మూలో సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి భార్య యమునకు ఫేస్‌బుక్ ద్వారా పానిపట్‌కు చెందిన దీపక్ అనే యువకుడితో పరిచమైంది. అనంతరం అది అక్రమ సంబంధంగా మారడంతో భర్త లేని సమయంలో యమున అతడిని ఇంటికి ఆహ్వానించింది.

కాగా సెప్టెంబర్ 29న సురేశ్ తన భార్య యమునకు ఫోన్ చేసి అక్టోబర్ 1న ఇంటికి వస్తున్నట్టు చెప్పాడు. అయితే ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించి ఒకరోజు ముందుగానే సెప్టెంబర్ 30న ఇంటికి వచ్చేశాడు. తీరా ఆమె మరొకరితో అభ్యంతరకరంగా కనిపించడంతో షాక్‌ అయ్యాడు. తీవ్ర ఆగ్రహంతో దీపక్‌ను ఇంట్లోనే కూర్చోబెట్టి... యమున సోదరుడు గౌరవ్‌ను ఇంటికి పిలిపించాడు. ఇద్దరూ కలిసి దీపక్‌కు బలవంతంగా విషాహారం తినిపించి హతమార్చారు. అయితే తనను క్షమించాలంటూ యమున వేడుకోవడంతో ఆమెను వదిలేశారు. దీపక్ మృతదేహాన్ని ఓ స్కూటర్‌పై తీసుకెళ్లి జింద్ ప్రాంతంలో ఓ రోడ్డుపక్కన పడేశారు.

మరుసటి రోజు స్థానికుల ద్వారా మృతదేహంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు తొలుత పానిపట్‌లోని స్థానిక యువకులపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. దీపక్ తన ఫోన్ ద్వారా యమునతో పలుమార్లు మాట్లాడినట్టు గుర్తించారు. యమున కోసం గాలింపు చేపట్టారు. అప్పుడే పారిపోయేందుకు బస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. తన భర్త, సోదరుడే దీపక్‌ను చంపినట్టు ఆమె ఒప్పుకోవడంతో కేసు చిక్కుముడి వీడింది.