కాశ్మీర్‌లో ఆర్మీ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలింది. ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలలోని గురేజ్ సెక్టార్‌లోని గుజ్రాన్ నల్లా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది.  

ఉత్తర కాశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లోని (Gurez Sector) నియంత్రణ రేఖ (Line of Control) వద్ద ఆర్మీ హెలికాఫ్టర్ ఒకటి కుప్పకూలింది. శుక్రవారం అస్వస్థతకు గురైన బీఎస్ఎఫ్ (Border Security Force) జవాన్‌లను తీసుకెళ్లేందుకు ఆర్మీకి చెందిన చీతా హెలికాఫ్టర్ (Army Cheetah helicopter) వచ్చింది. అయితే ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. హెలికాఫ్టర్ ల్యాండ్ అవ్వాల్సి వుందని.. అయితే ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగా అది వెనక్కి వెళ్లిపోయిందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలలోని గురేజ్ సెక్టార్‌లోని గుజ్రాన్ నల్లా సమీపంలో హెలికాఫ్టర్ కుప్పకూలింది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. అయితే వైమానిక విమానాలు గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.