జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ మృతి చెందింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
మాతృదేశ రక్షణ కోసం.. సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సరిహద్దుల్లో కాపాలా కాస్తున్నారు. వీరోచిత పోరాటాలు చేశారని ఎన్నో గాధాలు విన్నాం.. అయితే.. దేశం కోసం కేవలం సైనికులు, అధికారులే కాదు.. జాగిలాలు కూడా దేశం కోసం తామ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాటం చేశామని ఓ ఆర్మీ జాగిలం నిరూపించింది.
గత ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అడ్డుకోవడంలో ఆర్మీ డాగ్ జూమ్ విరోచితంగా పోరాడింది. ఈ క్రమంలో తూటాలు శరీరంలోకి దూసుకెళ్లినా ఈ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాని సహయంతో ఇద్దరు ముష్కరులను సైన్యం హతం చేసింది. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ డాగ్ 'జూమ్ మృతి చెందింది. శ్రీనగర్ లోని ఆర్మీ వెటర్నరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న జూమ్ గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తోయిబా ముష్కరులు ఉన్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఈ ముష్కరులను పట్టుకునే ఈ ఆపరేషన్ లో ఆర్మీ డాగ్ జూమ్ ని కూడా భాగం చేశారు అధికారులు. ఆ ముష్కరులను గుర్తించే బాధ్యతను ఆ జూమ్ కు అప్పగించారు.
ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఉన్న ఇంటి లోపలికి ఆర్మీ స్నిఫర్ డాగ్ జూమ్‌ను పంపారు. ఉగ్రవాదులను గుర్తించిన జూమ్.. వెంటనే వారిపై దాడి చేసింది. అయితే.. అక్కడే దాక్కున్న ఓ ఉగ్రవాది దానిపై కాల్పులు జరిపారు. రెండుసార్లు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడింది.
తుపాకీ గుండ్లు దాని శరీరాన్ని బాధిస్తున్న.. శరీరం నుంచి రక్తం కారుతున్నా.. జూమ్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించింది. దాని పోరాట ఫలితంగానే సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. అనంతరం తీవ్రంగా గాయపడిన జూమ్‌ని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. కానీ, చిక్సిత పొందుతూ నేడు మృతి చెందింది.
