ఇండియా పాకిస్థాన్ బార్డర్ లో బీఎస్ఎఫ్ జవాన్లు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లోని జీరో లైన్ వెంబడి నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ లో అవి లభించాయి. 

పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి ఆరు ఏకే-47 రైఫిళ్లు, మూడు పిస్టల్స్, 200 బుల్లెట్లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. రాత్రి 7 గంటలకు రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లోని సరిహద్దు జీరో లైన్ సమీపంలో భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ నేలపై ఓ బ్యాగ్ దొరికింది. అందులో ఈ ఆయుధాలు బయటపడ్డాయి.

దారుణం.. టీ తాగి ఐదుగురి మృతి.. చాయ్ పత్తా అనుకుని అది కలపడం వల్లే...

BSF అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బ్యాగ్‌లో మూడు ఏకే-47 రైఫిల్స్‌తో పాటు ఆరు ఖాళీ మ్యాగజైన్‌లు, మరో సెట్‌లో మూడు మినీ ఏకే-47 రైఫిల్స్‌తో ఐదు ఖాళీ మ్యాగజైన్లు, మూడు పిస్టల్స్‌తో ఆరు ఖాళీ మ్యాగజైన్లు, 200 లైవ్ బుల్లెట్లు ఉన్నాయి. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకుని తదుపరి విచారణలు నిర్వహించేందుకు వీలుగా పంజాబ్ పోలీసులకు బీఎస్ఎఫ్ మాచారం అందించింది. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. ఈరోజు తెల్లవారు జామున, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ కార్మికులను రక్షించాయి. అయితే అందులో ఒకరు మరణించారు. ‘‘ ఈ ఘటనలో ఓ కార్మికుడు మరణించాడు. మిగిలిన నలుగురిని ధావన్ నర్సింగ్ హోమ్‌లో చేర్చారు ’’ అని బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ అధికారులు తెలిపారు.