ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గత మూడు-నాలుగు నెలలుగా గుండెపోటు, కోవిడ్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తోందని,మరో రెండు నెలల్లో పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు.
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా నియమవళి పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వ్యాక్సిన్లు వేయించుకొని, బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని సూచించింది. అలాగే.. కరోనా, గుండెపోటుకు ఏమైనా సంబంధముందా ? అనే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరుణంలో NDTV ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. కోవిడ్ ఒక వైరస్ అని, ఇది మారుతూనే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. భారతదేశంలో ఇప్పటివరకు 214 వేరియంట్‌లు కనుగొనబడ్డాయి. ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్రిటికల్ కేర్‌కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి ప్రతి వారం సన్నాహాలను సమీక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్ ఎలా ప్రవర్తిస్తుందో అంచనా వేయడం సాధ్యం కాదని, అయితే ప్రస్తుతం కొత్త కేసుల పెరుగుదలకు కారణమయ్యే సబ్-వేరియంట్‌లు అంత ప్రమాదకరం కాదని మంత్రి వివరించారు.
మరోవైపు ఇటీవల పలు రాష్ట్రాల్లో యువకులు గుండెపోటుతో మరణించారు. పెరుగుతున్న గుండెపోటు నివేదికలపై విస్తృతమైన ఆందోళనలను ప్రస్తావిస్తూ.. గుండెపోటులకు కోవిడ్ తో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను ఆరోగ్యమంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందిన మంత్రి మాండవీయఅన్నారు. గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించిందని, ఆ వాటి ఫలితాలు రెండు మూడు నెలల్లో వస్తాయని ఆయన చెప్పారు. ఇటీవల పలు సందర్భాల్లో యువకులు గుండెపోటులో మరణించడం చూశామని, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి నివేదికలు రావడం ప్రారంభించాయని వీటిపై దర్యాప్తు చేయాల్సి ఉందని ఆయన అన్నారు.
కోవిడ్ ఫోర్త్ వేవ్ పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. చివరి కోవిడ్ మ్యుటేషన్ ఓమిక్రాన్ యొక్క BF.7 సబ్-వేరియంట్, ఇప్పుడు XBB1.16 సబ్-వేరియంట్ ఇన్ఫెక్షన్‌ల పెరుగుదలకు కారణమవుతోంది, మంత్రిత్వ శాఖ అనుభవంలో, ఉప-వేరియంట్‌లు చాలా ప్రమాదకరమైనవి కాదని ఆయన అన్నారు. కొత్త వేరియంట్‌ని గుర్తించినప్పుడల్లా.. వాటిపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గత మూడు నాలుగు నెలలుగా గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధంపై అధ్యయనం చేస్తోందని మరో రెండు నెలల్లో ఇది పూర్తవుతుందని ఆయన అన్నారు.
