Asianet News TeluguAsianet News Telugu

రామజన్మభూమి ఆధారాలు బయటపెట్టిన సీనియర్ ఆర్కియాలజిస్ట్ కన్నుమూత 

రామజన్మభూమి ఆధారాలను బయటపెట్టిన సీనియర్ ఆర్కియాలజిస్ట్ బీబీలాల్ కన్నుమూశారు.  ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు.

Archaeologist B.B. Lal passes away
Author
First Published Sep 10, 2022, 4:11 PM IST

బీబీ లాల్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బ్రజ్ బాసి లాల్ (101) కన్నుమూశారు.  బాబ్రీ మ‌సీదు ఉన్న స్థానంలోనే రామ మందిరం ఉండేద‌ని ఆయన ప‌రిశోధ‌న‌ల్లో పేర్కోన్నారు. ఈ పరిశోధనలు అయోధ్య భూవివాదం కేసులో ముఖ్యమైన సాక్ష్యంగా మారాయి. 

బీబీ లాల్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బీబీ లాల్‌తో తాను సమావేశమైన చిత్రాన్ని పంచుకుంటూ ప్రధాని ట్వీట్ చేశారు.  “బీబీ లాల్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. సంస్కృతి, పురావస్తు శాస్త్రానికి ఆయన చేసిన కృషి అసమానమైనది. మన సుసంపన్నమైన గతంతో మన అనుబంధాన్ని మరింతగా పెంచుకున్న గొప్ప మేధావిగా ఆయన గుర్తుండిపోతారు. ఆయన మరణం న‌న్ను క‌లిచివేసింది.. అని పేర్కొన్నారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

కేంద్ర‌ మంత్రి జి కిష‌ణ్ రెడ్డి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆర్కియాల‌జీ ప్రొఫెస‌ర్ బీబీ లాల్‌కు నివాళి అర్పించారు. బీబీ లాల్ అమోఘ‌మైన మేధావి, దేశంలో పురాత‌త్వ ప‌రిశోధ‌న‌ల‌కు విశేష సేవ‌లు అందించారు. గ‌త 4 ద‌శాబ్ధాలుగా ఎంతో మంది యువ ఆర్కియాల‌జిస్టుల‌కు శిక్ష‌ణ ఇస్తున్నార‌ని ట్వీట్ చేశారు. 

భారతదేశంలో అత్యంత సీనియర్ ఆర్కియాలజిస్ట్ అయిన  బీ.బీ.లాల్ .. 100 సంవత్సరాల వయస్సులో కూడా.. అతను పురావస్తు పరిశోధన, రచనలలో చురుకుగా పాల్గొన్నారు. బీబీ లాల్ మే 2, 1921న ఝాన్సీ జిల్లాలోని బడోరా గ్రామంలో జన్మించారు. అతను సిమ్లాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ డైరెక్టర్‌గా తన సేవలను ప్రారంభించాడు.

ఆయ‌న 1968 నుండి 1972 వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయ‌న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టేజెస్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఆయ‌న యునెస్కో యొక్క వివిధ కమిటీలలో కూడా పాల్గొన్నాడు. 1944లో సర్ మోర్టిమర్ వీలర్ అతనికి టాక్సిలాలో శిక్షణ ఇచ్చాడు. 

అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో తవ్వకాలకు ఆయ‌నే నాయకత్వం వహించారు. అతని నాయకత్వంలో ASI ఆ ప్రదేశంలో ఒక పురాతన దేవాలయం ఉందని నిరూపించింది. బాబ్రీ నిర్మాణానికి దక్షిణంగా ఉన్న ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు స్తంభాలు దొరికినట్లు ఆధారాలు ఇచ్చాడు. బాబ్రీ కట్టడం సమీపంలో స్తంభాల స్థావరాల ఆవిష్కరణ గురించి ఆయ‌న‌ ఏడు పేజీల ప్రాథమిక నివేదికను రాశాడు. అయితే.. నివేదిక‌ తర్వాత అన్ని సాంకేతిక సౌకర్యాలు ప్రాంతం నుండి ఉపసంహరించబడ్డాయి.  ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. ప్రొఫెసర్ లాల్ పదేపదే అభ్యర్థనలు చేసిన‌ప్పటికీ ..  ఆ ప్రాజెక్టు పునఃప్రారంభం కాలేదు.

ఆయ‌న‌ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించలేదు.  కానీ, అతని ప్రాథమిక నివేదికను 1989లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ అనే సంపుటిలో  ప్రచురించారు. రామ మందిరానికి మద్దతుగా ప్రధాన వాదన అయిన పురాతన ఆలయ అవశేషాలలో బాబ్డీ నిర్మాణాన్ని వెలికి తీయడంలో బీబీ లాల్ కీలక పాత్ర పోషించారు. అనంతరం ఆలయానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 

ఇదే కాకుండా.. రామాయణంలోని కొన్ని ప్రదేశాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన‌ రామాయణం ఆర్కియాలజీ అనే ప్రాజెక్ట్‌కు 1975- 1976 ప్రాంతంలో ఆయ‌న‌ నాయకత్వం వహించాడు. ఈ బృందంలో తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు. వీరు అయోధ్య, నందిగ్రామ్, శృంగవేరాపూర్, భరద్వాజ్ ఆశ్రమం, చిత్రకూట్ పాంత్రాల‌లో రామాయణానికి సంబంధించిన ఆన‌వాళ్ల కోసం త్ర‌వ్వ‌కాలు చేపట్టారు.  

2000లో బిబి లాల్‌కి పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. దీని తరువాత, అతను 2021 లో పద్మభూషణ్ కూడా అందుకున్నాడు. ఆయ‌న‌ మహాభారతం, రామాయణం సంబంధించి సింధు లోయ, కాళీబంగన్‌కు సంబంధించిన ప్రదేశాలలో విస్తృతంగా ప‌రిశోధ‌న‌లు చేశారు. ఆయన ఎన్నో పుస్తకాలు, వందలాది పరిశోధనా పత్రాలు వెలువ‌డించారు.

Follow Us:
Download App:
  • android
  • ios