యాపిల్ ఫోన్ సేఫా? కాదా?: హ్యాకింగ్ వాదనలపై కేంద్రమంత్రి స్పందన

యాపిల్ ఫోన్ సేఫేనా? కాదా? అనే విషయాన్ని ఇప్పుడు ఆ సంస్థ వెల్లడించాల్సి ఉన్నదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ రోజు కొందరి యాపిల్ ఫోన్లకు హ్యాక్‌కు సంబంధించి ఓ నోటిఫికేషన్ వచ్చింది. అందులో స్టేట్ యాక్టర్స్ అని పేర్కొనడంతో అందరూ కేంద్ర ప్రభుత్వంపైకి వేళ్లు చూపారు. 
 

apple device secure or not, apple must explain says union minister rajeev chandrasekhar kms

న్యూఢిల్లీ: యాపిల్ ఫోన్ ప్రత్యేకతల్లో ప్రధానంగా చెప్పుకునేది డేటా సేఫ్టీ. యాపిల్ ఫోన్‌ను నుంచి డేటా చౌర్యం  సాధ్యం కాదని, హ్యాక్ చేయడం దుస్సాధ్యం అని చెబుతారు. యాపిల్ బ్రాండ్ వ్యాల్యూకు ఇది కీలకమైన అంశం. అలాంటిది ఈ రోజు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంచలన కామెంట్ చేశారు. యాపిల్ ఫోన్ సేఫా? కాదా? అనేది ఆ కంపెనీ కచ్చితంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఈ రోజు ప్రతిపక్ష నేతల యాపిల్ ఫోన్‌లకు ఓ హ్యాకింగ్ వార్నింగ్ వచ్చింది. స్టేట్ అటాకర్లు మీ ఐఫోన్ టార్గెట్ చేసుకుని దాడులకు, హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనేది ఆ వార్నింగ్ మెస్సేజీ సారాంశం. ఇది వరకే పెగాసెస్ నేపథ్యం ఉన్నందున ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వమే ప్రతిపక్షాలపై నిఘా వేస్తున్నాయని విమర్శించాయి. 

ఈ వాదోపదవాదనలపై కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. ఇది ఎన్నికల సీజన్, ప్రతి ఒక్కరూ అనేక విధాల వాదనలు చేయడం సహజం అని రాజకీయ పార్టీల ఆరోపణలను కొట్టేసిన ఆయన ఈ ఉదంతంపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. అసలు ఆ నోటిఫికేషన్‌కు అర్థం ఏమిటో యాపిల్ సంస్థనే తెలుపాలని అన్నారు. అసలు వారి ప్లాట్ ఫామ్ హ్యాక్‌కు గురైందా? లేక సేఫ్‌గానే ఉన్నదా? ఆ నోటిఫికేషన్ నమ్మదగినదేనా? అనే విషయాలను ఆ సంస్థనే వివరించాల్సి ఉన్నదని తెలిపారు. దర్యాప్తు ప్రతి అంశాన్ని వెల్లడిస్తుందని చెప్పారు. ఆ నోటిఫికేషన్‌లోని స్టేట్ యాక్టర్స్ అని ఉన్నదని, దాని అర్థం ఏమిటో వివరించాలనీ ఆయన డిమాండ్ చేశారు.

Also Read: మీ టీచర్ రమ్మంటున్నదని చెప్పి స్టూడెంట్‌ను తీసుకెళ్లి హత్య.. టీచర్ బాయ్‌ఫ్రెండ్‌ అరెస్టు

కాగా, ఈ నోటిఫికేషన్‌లో స్టేట్ యాక్టర్స్ అంటే ప్రభుత్వ సంస్థలు కాదని యాపిల్ సంస్థ వివరణ ఇచ్చింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios