"అపేక్ష" ఫోటోకు యాపిల్ సీఈఓ ఫిదా.. ఆ ఫోటో షేర్ చేస్తూ దీపావళి విషెష్..
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సోషల్ మీడియా వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్బంగా ఆయన ముంబైకి చెందిన ఫోటోగ్రాఫర్ అపేక్షా మేకర్ తీసిన ఫోటోకు ఫిదా అయ్యారు. ఆ ఫోటోను తన ట్విటర్‌లో షేర్ చేశారు.దీపావళిని ఎందుకు దీపాల పండుగ అని పిలుస్తారో ఈ ఫోటో చాలా అందంగా వివరించిందని అన్నారు.
ముంబైకి చెందిన ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోకు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఫిదా అయ్యారు. అపేక్షా మకర్ అనే ఫోటో గ్రాఫర్ తీసిన దీపావళి ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన అంతటితో ఆగకుండా.. ఈ చిత్రం 'దీపావళి పండుగ'అంటే ఏమిటో చాలా స్పష్టంగా వివరిస్తుందంటూ క్యాప్షన్ పెట్టారు.
ఐఫోన్‌లో చిత్రీకరించబడిన ఈ ఫోటోలో స్త్రీ గోరింట చేతులతో చుట్టబడిన 'దియా' కనిపిస్తుంది. దీపావళిని దీపాల పండుగగా ఎందుకు పిలుస్తారో ఈ చిత్రం చాలా అందంగా వివరిస్తుంది.ప్రతి ఒక్కరూ సంతోషంగా,శ్రేయస్సుతో ఈ పవిత్రమైన రోజును జరుపుకోవాలని కోరుకుంటున్నాను"అంటూ.. టీమ్ కుక్ దీపావళి విషెష్ తెలిపారు.
అపేక్ష మేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను కుక్ ట్వీట్ స్క్రీన్‌షాట్ చేసి పంచుకున్నారు. ఆపిల్ సీఈఓ తన చిత్రాలలో ఒకదాన్ని పంచుకోవడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది."దీపావళికి నా ఫోటోను యాపిల్ సీఈఓ షేర్ చేయడం చాలా సంతోషంగా.. ఉత్సాహంగా ఉంది! మీ అందరికీ శ్రేయస్కరం కావాలని కోరుకుంటున్నాను" అని అపేక్ష సోషల్ మీడియాలో రాసుకోచ్చారు.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ బయో ప్రకారం.. అపేక్ష ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ఆమె కియారా అద్వానీ, దీపికా పదుకొనే , అనుష్క శర్మలతో సహా అగ్ర తారలతో పాటు ప్రముఖ వ్యక్తులతో కలిసి పని చేసింది. ఆమె హౌస్ ఆఫ్ పిక్సెల్స్ వ్యవస్థాపకురాలు కూడా.
ఇదిలా ఉంటే, గత నెలలో టిమ్ కుక్ .. ఐఫోన్‌ల కోసం iOS యాప్‌ను రూపొందించిన దుబాయ్‌లో నివసిస్తున్న 9 ఏళ్ల బాలికను అభినందించారు. హనా ముహమ్మద్ రఫీక్ అనే బాలిక "హనాస్" అనే యాప్ ను అభివృద్ధి చేసింది . ఇదొక స్టోరీ టెల్లింగ్ యాప్. ఈ యాప్ ద్వారా కథనాలను, పాటలను రికార్డ్ చేసి.. పిల్లలకు వినిపించవచ్చు.
ఆ చిన్నారి ఈ యాప్ వివరాలతో పాటు తాను సాధించిన ఇతర విజయాలను వివరిస్తూ.. టిమ్ కుక్ కు ఇమెయిల్ చేసింది. ఆ చిన్నారి ఇమెయిల్ కు ప్రతిస్పంచిన Apple CEO ఆమెను అభినందించారు. టిమ్ కుక్ ఆమెకు ఇలా వ్రాశాడు, "ఇంత చిన్న వయస్సులో మీరు సాధించిన అన్ని అద్భుతమైన విజయాలకు అభినందనలు. దీన్ని కొనసాగించండి .మీరు భవిష్యత్తులో అద్భుతమైన పనులు చేస్తారు" అని పేర్కొన్నారు.