Asianet News TeluguAsianet News Telugu

భార‌తీయ‌ చిన్నారిపై యాపిల్ సీఈఓ ప్రశంసల వ‌ర్షం..  ఆ చిన్నారి ఏం చేసిందో తెలిస్తే షాకే.. 

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్, టెక్ కంపెనీ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తొమ్మిదేళ్ల భారతీయ యాప్ డెవలపర్ హనాను అభినందించారు. హనా తాను రూపొందించిన యాప్ గురించి వివ‌రిస్తూ.. మెయిల్ చేసింది. కుక్ కూడా ఆ ఆ చిన్నారి ఇమెయిల్ రిప్లైలో ప్రశంసించాడు.  

Apple CEO Tim Cook Praises 9-Year Old Indian Girl Who Developed An iOS App
Author
First Published Sep 26, 2022, 2:42 AM IST

ఆధునిక సాంకేతిక కాలంలో పిల్లలు చాలా చిన్నవయసులోనే టెక్నాలజీ వైపు ఆకర్షితుల‌వుతున్నారు. చిన్న వయ‌స్సులోనే టెక్నాల‌జీ గురించి తెలుసుకుంటున్నారు. సంప్ర‌దాయ చదువుల‌పై కాకుండా.. సాంకేతిక చ‌దువుల‌పై మ‌గువ చూపుతున్నారు. ఈ క్ర‌మంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌ను చేపడుతున్నారు. ఈ కోవ‌కే చెందిన ఓ చిన్నారి చిచ్చర పిడుగు ఏకంగా యాపిల్ సీఈఓని ఫిదా చేసింది. కేవ‌లం 9 ఏండ్ల వ‌య‌స్సులోనే .. తాను ఏం  సాధించానో వివ‌రించి.. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను ఆశ్చ‌ర్యప‌రిచింది. 

వివ‌రాల్లోకెళ్లే.. హనా ముహమ్మద్ రఫీక్ అనే  తొమ్మిదేళ్ల బాలిక దుబాయ్‌లో తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఆ చిన్నారికి టెక్నాల‌జీ అంటే.. చాలా మ‌క్కువ .. ఎంత‌గా అంటే.. కేవ‌లం 5 ఏండ్ల వ‌యస్సులో  కోడింగ్ నేర్చుకుంది. అలాగే.. కేవలం 9 ఏండ్ల వ‌య‌స్సులో iOS డెవలపర్ గా మారాన‌నీ తెలిపింది.  ఎనిమిదేండ్ల వ‌య‌స్సులోనే  ఓ అద్భుత‌మైన స్టోరీ టెల్లింగ్ యాప్ రూపొందించాన‌ని తెలిపింది. ఆ యాప్ కోసం  ఇతరులు రాసిన కోడ్‌ను లేదా లైబ్రరీలు లేదా క్లాస్‌లను వాడ‌కుండా.. స్వంతంగా తాను  ప‌దివేల లైన్ల కోడ్‌ను రాశానని.. ఫైన‌ల్ గా  ఓ అద్భుత‌మైన యాప్ ను త‌యారు చేశాన‌ని తెలిపింది.

ఓ సారి త‌న యాప్ ను స‌మీక్షించాలని టిమ్ కుక్ కు మెయిల్ చేసింది.  హానా యాప్‌ను చూసి ఇంప్రెస్ అయిన టిమ్ కుక్ వెంటనే రిప్లై ఇచ్చారు. ఆ చిన్నారిని అభినందించారు. అతి చిన్న వ‌య‌స్సులో ఓ అద్భుత‌మైన యాప్ డిజైన్ చేసినందుకు శుభాకాంక్షలు.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ రిప్లై ఇచ్చారు. ఆపిల్ సీఈఓ  త‌న మెయిల్ కు  రిప్లై ఇచ్చిన విషయాన్ని హానా తండ్రే ఆమెకు చెప్పారు. దీంతో.. ఆమె సంతోషానికి అవ‌ధుల్లేవ్. 

హానాతో రూపొందించిన యాప్ చాలా ప్ర‌త్యేకమైంది. ఈ యాప్ లో తల్లిదండ్రులు ముందుగానే తమ కథలు రికార్డు చేయచ్చు. దీంతో.. పిల్ల‌లు నిద్రపోతున్న సమయాల్లో ఆ క‌థ‌ల‌ను వినిపించుకోనే అవ‌కాశం ఉంది. ఈ యాప్‌ను హానా అందరికీ ఉచితంగానే ఇస్తోంది. ఇటీవల కాలంలో ఏ త‌ల్లిదండ్రులు కూడా త‌మ పిల్లలకు కథలు వినిపించ‌లేకపోతున్నారు. ఈ విష‌యాన్ని బేస్ చేసుకుని యాప్ రూపొంచిన‌ట్టు తెలిపింది.

ఒక డాక్యుమెంటరీ చూసిన తర్వాత ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. పనిలో తమ రోజును ప్రారంభించే ముందు, తల్లిదండ్రులు తమ పిల్లలు నిద్రపోతున్నప్పుడు వినడానికి కథలను రికార్డ్ చేయవచ్చు. ఇది కాకుండా.. ఆ చిన్నారి.. లీనా లెహనాస్ అనే వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది, ఇది పిల్లలకు పదాలు, రంగులు, జంతువుల పేర్లు వంటి విష‌యాల‌ను నేర్ప‌డంతో ఉప‌యోగ‌ప‌డుతోంది.  అయితే లీనా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకుంటోంది. లీనాకు కోడింగ్ చాలా ఇష్టం.

 

Follow Us:
Download App:
  • android
  • ios