శ్రీసాయి క్యాంపస్‌లోని అలకనంద హాస్టల్‌లో ఉంటున్నాడు. మంగళవారం శ్రీసాయి క్లాస్ కు రాలేదు. అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు వెళ్లి చూడగా చనిపోయి కనిపించాడు. 

చెన్నై : ఐఐటీ-మద్రాస్‌లో బీటెక్‌ చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి మంగళవారం తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వి వైపు పుష్పక శ్రీసాయి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసాయి క్యాంపస్‌లోని అలకనంద హాస్టల్‌లో ఉంటున్నాడు. మంగళవారం శ్రీసాయి తరగతికి రాలేదు. ఉదయం 11.30 గంటలకు అతని స్నేహితులు అతనిని వెతుక్కుంటూ.. అతని గదికి చేరుకున్నారు. 

"డోర్ లోపలి నుండి గొళ్లెం పెట్టి ఉంది. దీని తరువాత విద్యార్థులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ శ్రీసాయి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కొత్తూరుపురం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీసాయి హాస్టల్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

ప్రియురాలి పెళ్లి ఫొటోలు చూసి తట్టుకోలేక.. జేబులో తాళి పెట్టుకుని.. ఆ ప్రియుడు చేసిన పని..

ఇదిలా ఉండగా, శ్రీసాయి మరణంపై ఐఐటీ-మద్రాస్ ఒక ప్రకటనలో, కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఐఐటీలో వాతావరణం కాస్త ఒత్తిడితో, ఛాలెంజింగ్ గా ఉంటోందని పేర్కొంది. "ఇటీవల ఏర్పాటు చేయబడిన ఎన్నుకోబడిన విద్యార్థి ప్రతినిధులతో సహా స్టాండింగ్ ఇన్స్టిట్యూట్ అంతర్గత విచారణ కమిటీ అటువంటి సంఘటనలను పరిశీలిస్తుంది" అని యాజమాన్యం తెలిపింది. మహారాష్ట్రకు చెందిన స్టీఫెన్ సన్నీ అనే రీసెర్చ్ స్కాలర్ ఫిబ్రవరి 13న ఐఐటీ-మద్రాస్‌లోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

(ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారికి సహాయం రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్ప్‌లైన్ 104, ఆత్మహత్యల నివారణ హెల్ప్‌లైన్ 044-24640050లో అందుబాటులో ఉంది)