Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ ను కలిసిన చంద్రబాబు: మే 21న కీలక భేటీకి ప్లాన్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు పూర్తికానున్న నేపథ్యంలో మే 21న విపక్ష పార్టీలన్నింటితో సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మే 21న బీజేపీ యేతర కూటమి ఎజెండాపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ గాంధీకి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. 

ap cm chandrabbu met aicc president rahulgandhi
Author
Delhi, First Published May 8, 2019, 7:56 PM IST

ఢిల్లీ: ఏపీలో ఎన్నికలు పూర్తవ్వడంతో సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ యేతర కూటమిని ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు చంద్రబాబు. 

దేశవ్యాప్తంగా 21 పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అనంతరం ఈవీఎం, వీవీ ప్యాట్ ల లెక్కింపు అంశాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారు. ఇటీవలే వీవీ ప్యాట్ ల లెక్కింపు అంశంపై వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 

దీంతో చంద్రబాబుతో సహా విపక్షాలన్నీ షాక్ కు గురయ్యాయి. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వీవీ ప్యాట్ లు లెక్కించాలని డిమాండ్ చేశారు. అనంతరం దేశ రాజకీయాలపై హస్తినలో బిజీబిజీగా గడిపారు. 

ఫెడరల్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో చంద్రబాబు సైతం వేగం పెంచారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీవీ ప్యాట్ ల లెక్కింపుపై సుప్రీంకోర్టు నో చెప్పడం, సిఈసీతో భేటీలో ప్రస్తావించిన అంశాలపై చంద్రబాబు రాహుల్ గాంధీతో చర్చించారు. 

 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీయేతర కూటమి ఎజెండాపై ప్రధానంగా చర్చించారని తెలుస్తోంది. 

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు పూర్తికానున్న నేపథ్యంలో మే 21న విపక్ష పార్టీలన్నింటితో సమావేశం నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మే 21న బీజేపీ యేతర కూటమి ఎజెండాపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ గాంధీకి చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. 

రాహుల్ గాంధీతో భేటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు పశ్చిమబెంగాల్ వెళ్లిపోయారు. బుధవారం, గురువారం రెండురోజులపాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios