Asianet News TeluguAsianet News Telugu

వాజ్ పేయి కి ప్రముఖుల నివాళి

 మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గొప్ప రాజనీతిజ్ఞుడని ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వాజ్ పేయి మరణవార్త తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్ లోని వాజ్ పేయి నివాసంలో ఆయన పార్ధీవ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. 

AP CM Chandrababu pays tribute to Atal Bihari Vajpayee
Author
Delhi, First Published Aug 17, 2018, 10:57 AM IST

ఢీల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో అటల్ జీ పార్ధీవ దేహానికి నివాళులర్పించిన నేతలు ఆయన సేవలను కొనియాడారు. అటల్ జీ లేని లోటు ఎవరూ తీర్చలేరని పలువురు అభిప్రాయపడ్డారు. 

అటల్ జీ మహాపురుషుడు. ఆయన మరణం బాధాకరం. మన మధ్యలో ఆయన లేనప్పటికీ మన మనస్సులో ఎప్పుడూ ఉంటారు. దేశం మంచి వ్యక్తిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను....గవర్నర్ నరసింహన్ 

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గొప్ప రాజనీతిజ్ఞుడు. వాజ్ పేయి మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యా..వాజ్‌పేయీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వాజ్ పేయి మృతి దేశానికి తీరని లోటు. అన్ని సంస్కరణలకు వాజ్‌పేయీ ఆద్యుడు. ఆయనకు ఎవరూ సాటిరారు. మంచి నిర్ణయంపై సానుకూలంగా ఆలోచించేవారు. నమ్మకున్న సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉన్న వ్య క్తి అటల్ బిహారీ వాజ్ పేయి....ఏపీ సీఎం చంద్రబాబు

వాజ్ పేయి లేరు అన్న వార్త హృదయం ద్రవించిపోతుంంది. ఆయన అజాత శత్రువు. ఎవరిని శత్రువుగా చూడలేదు. అందరిని కలుపుకపోయే వ్యక్తి. ప్రస్తుత సమయంలో ఆయన లాంటి గొప్ప రాజకీయవేత్త అవసరం. అలాంటి సమయంలో ఆయన లేకపోవడం దురదృష్టకరం. ఆయన లేని లోటు మనం తీర్చలేం. ఆయన ప్రతీ ఒక్కరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారు...టీఆర్ఎస్ ఎంపీ కేకే 

వాజ్ పేయి పెద్ద మనసున్న వ్యక్తి.  తన మనస్సుతో ప్రపంచాన్నిజయించారు. అటల్ జీ ఒక స్టాలిన్. అన్ని పార్టీలను కలుపుకుపోయిన వ్యక్తి అటల్ జీ.
దేశం ఒక పునాదిలాంటి వ్యక్తిని కోల్పోయింది.... టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి
 
నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మానవతా దృక్పదంతో ప్రజల మనోభవాలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి. మితవాదాన్ని నమ్మి సమర్థవంతంగా పరిపాలన అధ్యక్షుడుగా సుపరిపాలన అందించారు. పదిసార్లు లోక్ సభకు, రెండు సార్లు రాజ్య సభకు ఎన్నికైన గొప్ప వ్యక్తి వాజ్ పేయి. దేశానికి దిశా నిర్దేశం చేసిన మహానుభావుడు అటల్ జీ...వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

 
భారతదేశంలో ప్రతీ ఒక్కరినీ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని ఆదరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే భారతరత్నవాజ్ పేయి. ఆయన పుట్టిన రోజున గుడ్ వర్ననెన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆయన సేవలు అంతటి గొప్పవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆయన బంధువులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటున్నాను. ...వైసీపీ ఎంపీ వరప్రసాద్

వాజ్ పేయి మరణం దేశానికి చాలా నష్టం. వాజ్ పేయి వంటి నాయకులను స్పూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలి. వాజ్ పేయి ని ఆదర్శంగా ప్రస్తుత నాయకుల నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన ఆశయాలకనుగుణంగా నడిచే వ్యక్తులు కావాలి. ఆయన చూపించిన మార్గంలో నడవాలి....వాజ్ పేయి ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.......మంత్రి యనమల రామకృష్ణుడు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios