అరుదైన అవకాశం: ప్రధాని కార్యాలయంలోకి ఆమ్రపాలి

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి ఆమ్రపాలికి అరుదైన అవకాశం లభించింది. ఆమ్రపాలి ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులయ్యారు.

AP cadre IAS officer Amrapali in PMO office as deputy secretary

న్యూఢిల్లీ: తన సమర్థతతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఐఎఎస్ అధికారి ఆమ్రపాలికి విశిష్టమైన అవకాశం దక్కిం్ది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)లో ఆమె డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు. 

ప్రధాని కార్యాలయంలో నియమితులైన ముగ్గురు ఐఎఎస్ అధికారుల్లో ఆమ్రపాలి ఒక్కరు. ప్రధాని కార్యాలయంలో ఆమె 2023 అక్టోబర్ 27వ తేదీ వరకు కొనసాగుతారు. పీఎంవోలో డైరెక్టర్ గా రఘురాజ్ రాజేంద్రన్, అండర్ సెక్రటరీగా మంగేష్ గల్దియాల్ ను నియమిస్తూ ఆపాయింట్ మెంంట్స్ కమిటీ ఆప్ ది కేబినెట్ శనివారం ఆదేశాలు జారీ చేశారు 

2010 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్ గా, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 

ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ లో డిప్యూటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పిఎంవోలో నియమితులైన రఘురాజ్ రాజేంద్రన్ 2004 బ్యాచ్ మధ్యప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఎఎస్ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. 2012 బ్యాచ్ కు చెందిన ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఎఎస్ అదికారి మంగేష్ గిల్దియాల్ పిఎంవో అండర్ సెక్రటరీగా నియమితులయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios