న్యూఢిల్లీ: చత్తీస్ ఘడ్ గవర్నర్ గా బీజేపీ సీనియర్ మహిళా నేత అనసూయ ఊకిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. అనసూయ ఊకీ ప్రస్తుతం నేషనల్ ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ బీజేపీలో కీలక నేతగా అనసూయ ఊకీ వ్యవహరిస్తున్నారు.