Asianet News TeluguAsianet News Telugu

ఉరిశిక్షలో మరో ట్విస్ట్.. సుప్రీమ్ కోర్టుకు నిర్భయ నిందితుడు

నిర్భయ దోషుల క్షమాభిక్షను ఇటీవల రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే కేసులో ఒకరైన నిందితుడు ముఖేష్ సింగ్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు.  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. 

another twist in nirbhaya case
Author
Delhi, First Published Jan 25, 2020, 4:38 PM IST

దాదాపు ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆమె చావుకు కారణమైన నలుగురు దోషులకు ఉరి సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆ నలుగురు దోషులను న్యాయస్థానం ఉరితో శిక్షించనుంది. వీరి ఉరికి తీహార్ జైల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్భయ దోషుల క్షమాభిక్షను ఇటీవల రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే కేసులో ఒకరైన నిందితుడు ముఖేష్ సింగ్ సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ క్షమాభిక్షను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఉరిశిక్ష ఆలస్యం చేయాలనే ఉద్దేశ్యంతోనే కావాలని నిందితులు ఇలా చేస్తున్నట్లు తీహార్ జైలు అథారిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.  అలాగే కుటుంబ సభ్యులను ఎప్పుడు కలుస్తారంటే నిర్భయ కేసు దోషులు నోరు విప్పడం లేదు.

నిర్భయ కేసు దోషులు వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముకేష్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను జైలు నెంబర్ 3లో విడివిడి సెల్స్ లో ఉంచారు. వారికి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్న విషయం తెలిసిందే. తమ తమ కుటుంబ సభ్యులను ఎప్పుడు కలుస్తామనే విషయాన్ని దోషులు చెప్పడం లేదని తీహార్ జైలు అధికారులు గరువారంనాడు చెప్పారు. తమ కుటుంబ సభ్యులతో భేటీ కావడంతో పాటు తమ తమ ఆస్తులు ఎవరికి చెందుతాయనే విషయాన్ని కూడా వారు చెప్పాల్సి ఉంటుంది. ఆ విషయాలపై దోషులు నోరు విప్పడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios