Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ ఇండియాలో మరో షాకింగ్ ఘటన .. మద్యం మత్తులో తోటీ ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన .. 

న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో జరిగిన షాకింగ్ ఘటన మరవకముందే ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పది రోజుల తర్వాత.. ప్యారిస్-ఢిల్లీ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై తాగిన ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.క్షమాపణలు చెప్పినా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది వేరే విషయం.

Another Mid-Air Peeing Incident, Now On Paris-Delhi Air India Flight
Author
First Published Jan 6, 2023, 1:43 AM IST

ఎయిరిండియాలో జరిగిన అమానుష్య ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియాలో జరిగిన షాకింగ్ ఘటన మరవకముందే ఇలాంటిదే మరో ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. పది రోజుల తర్వాత.. ప్యారిస్-ఢిల్లీ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై తాగిన మగ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. అయితే.. నిందితుడు వ్రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. దీంతో నిందితుడుపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోలేదని అధికారులు గురువారం తెలిపారు. ఈ ఘటన డిసెంబరు 6న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 142లో జరిగింది. విమానం పైలట్ ఈ విషయాన్ని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి సమాచారం అందించాడు. ఆ ప్రయాణికుడిని పట్టుకున్నారు. ప్రయాణికుడు ఏ తరగతిలో ప్రయాణిస్తున్నాడో తెలియరాలేదు.

ఉదయం 9:40 గంటలకు విమానం ఢిల్లీలో ల్యాండ్ అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిందిత ప్రయాణికుడు మద్యం మత్తులో ఉన్నట్లు విమానాశ్రయ నిర్వాహకులకు సమాచారం అందింది. అతను క్యాబిన్ సిబ్బంది సూచనలను పాటించలేదు , తరువాత అతడు ఒక మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే మగ ప్రయాణికుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) పట్టుకుంది. అయితే ఇద్దరు ప్రయాణికుల మధ్య పరస్పర ఒప్పందం జరగడంతో ఆ వివాదం ముగిసిపోయింది.
మహిళా ప్రయాణికురాలు పోలీస్ కేసు పెట్టడానికి నిరాకరించింది. దీంతో ఇమ్రిగ్రేషన్, కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత ప్రయాణికుడిని బయటకు అనుమతించారు.

ఇదిలా ఉంటే..  న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలిపై మద్యం మత్తులో ఉన్న ఓ తోటీ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన  నవంబర్ 26 జరిగింది. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తీవ్ర ఆగ్రహం చేసింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ దారుణంపై జాతీయ మహిళా కమిషన్ కూడా సిరీయస్ అయింది. ఈ క్రమంలో ఎయిరిండియా అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు డీజీసీఏ, ఎయిరిండియా సిద్ధమయ్యాయి. 

ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై ఎయిరిండియా 30 రోజుల నిషేధాన్ని విధించింది. ప్రస్తుతం నిందితుడు ముంబైలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది. బాధిత మహిళ ఫిర్యాదుతో  ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎయిర్ ఇండియా వైఖరి తప్పు బడుతున్నారు. నిందితుడి వివరాలను ఎందుకు వెల్లడించలేదని కొందరు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ నివేదిక కోరింది.  

కెప్టెన్ , సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్

ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ షోకాజ్ నోటీసు జారీ చేయాలని డిజిసిఎ మాజీ డైరెక్టర్ జనరల్ ఎంఆర్ శివరామన్ అన్నారు. విమానయాన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదో ఆయనే చెప్పాలి? అతను అక్కడ ఉండి ఉంటే.. తాను కెప్టెన్,  సిబ్బందిని సస్పెండ్ చేసి ఉండేవాడని అన్నారు. లైట్లు ఆఫ్ చేయడంతో  ప్రయాణికుడు తన సీటుపైకి వచ్చారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.  

ఈ కేసులో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి
ఈ మొత్తం వ్యవహారంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిగా, విషయం పోలీసులకు చేరడానికి నెల ఎలా పట్టింది? రెండవది, నిబంధనల ప్రకారం సిబ్బంది ఆ ఆకతాయి ప్రయాణికుడిని ఎందుకు అరెస్టు చేయలేదు.  ఈ మొత్తం విషయంలో వికృతంగా వ్యవహరించిన ప్రయాణికుడికి సిబ్బంది స్వేచ్ఛనిచ్చారని ఏవియేషన్ లాయర్ తెలిపారు.   విమానయాన సంస్థ ప్రవర్తన పూర్తిగా దిగ్భ్రాంతికరంగా ఉందని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios