ఉగ్రసంస్థలతో మదర్సాలకు లింకులున్నా, అక్రమంగా నిర్మించిన మదర్సాలను అస్సాం సర్కారు కూల్చివేస్తోంది. తాజాగా తీవ్రవాద సంస్థ అల్ కాయిదాతోపాటు బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నా.. మార్క్‌జుల్ మా-ఆరిఫ్ క్వారియానా మదర్సాను బుధవారం అధికారులు కూల్చివేశారు
అనుమానిత, ఉగ్రసంస్థలతో సంబంధాలున్న మదర్సాపై అస్సాం సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాటిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ అల్ కాయిదాతో సంబంధాలున్న బొంగైగావ్ జిల్లా కబితరీ గ్రామంలోని మార్క్‌జుల్ మా-ఆరిఫ్ క్వారియానా మదర్సాను బుధవారం కూల్చివేసింది. అలాగే.. అల్-ఖైదాతో సంబంధం ఉన్న ఇమామ్‌లు. మదర్సా ఉపాధ్యాయులతో సహా 37 మందిని అరెస్టు చేసింది. ఇది మూడో కూల్చివేత.. అస్సాం సర్కార్ వారం రోజుల్లో రెండు మదర్సాపై చర్యలు తీసుకుంది. కాగా ఇప్పటి వరకు మూడు మదర్సాలు నేలమట్టమయ్యాయి.
ఈ మదర్సా కూల్చివేతకు ముందు.. అందులోని నుంచి విద్యార్థులను ఖాళీ చేయించి.. ఇతర విద్యాసంస్థలకు పంపించారు. గతంలో ఈ మదర్సాకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఈ మదర్సాపై దాడులు చేయగా.. నిషేధిత రాడికల్ గ్రూపులకు సంబంధించిన పలు పత్రాలు, ప్రచార ప్రతులు లభ్యమయ్యాయి. తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంగా హఫిజర్ రెహమాన్ అనే మదర్సా టీచర్‌ను ఈ నెల 26న అరెస్ట్ చేయగా, గోల్పారా జిల్లాలో ఇద్దరు ఇమామ్‌లను అరెస్టు చేశారు.
బార్‌పేటలోని మదర్సా కూల్చివేత
అస్సాంలోని బార్‌పేట జిల్లా ని ఢక్లియాపరా ప్రాంతంలోని ఉన్నషేఖుల్ హింద్ మహ్మదుల్ హసన్ జామియుల్ హుదా అనే మదర్సాను సోమవారం తెల్లవారుజామున ప్రభుత్వం కూల్చివేసింది. అల్-ఖైదా, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ బంగ్లా టీమ్ (ABT)తో మదర్సాకు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనపై బార్‌పేట ఎంపీ అమితాబ్ సిన్హా మాట్లాడుతూ.. ఈ మదర్సాను ప్రభుత్వ స్థలంలో నిర్మించారని, అందుకే నిర్వాకం చేపట్టిన తొలగింపు డ్రైవ్‌లో కూల్చివేశారని అన్నారు. ఆ సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను కూడా మోహరించినట్టు తెలిపారు.
ఈ ఘటనపై డీఎస్పీ స్వప్నానీల్ డేకా మాట్లాడుతూ.. తాజాగా కబైతరి ప్రాంతంలోని మదర్సాను బుధవారం ఉదయం బుల్డోజర్లతో కూల్చివేశారని తెలిపారు. దీనికి సంబంధించి మంగళవారమే నోటీస్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న 200 మంది విద్యార్థుల్ని స్వస్థలాలకు పంపినట్లు డీఎస్పీ డేకా తెలిపారు. తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉండటంతోపాటు, ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని, అందుకే కూలుస్తున్నామని చెప్పారు. అలాగే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఉగ్రవాద సంస్ధలతో సంబంధాలు ఉన్న 37 మంది వ్యక్తుల్ని అరెస్టు చేసినట్టు తెలిపారు.
