Asianet News TeluguAsianet News Telugu

జంతువులను వదలని కోవిడ్: చెన్నైలో మరో మగ సింహం మృతి

కరోనాతో చెన్నై జూపార్క్‌లో మగ సింహం మరణించింది. మనుషులనే కాదు జంతువులను కూడ కరోనా వదలడం లేదు. వండలూరు జూ పార్క్ లో సింహం కరోనాతో బుధవారం నాడు మరణించిందని అధికారులు ప్రకటించారు.
పత్బనాథన్ అనే 12 ఏళ్ల మగ సింహనికి ఇటీవల అనారోగ్యానికి గురైంది. పరీక్షలు నిర్వహిస్తే ఈ నెల 3న కరోనా సోకిందని తేలింది.  ఈ నెల 16వ తేదీ ఉదయం 10:15 గంటలకు మగ సింహం కరోనాతో మరణించిందని  వండలూరు జూపార్క్ అధికారులు ప్రకటించారు.

Another lion dies at Chennai zoo due to corona lns
Author
Chennai, First Published Jun 17, 2021, 10:07 AM IST


చెన్నై: కరోనాతో చెన్నై జూపార్క్‌లో మగ సింహం మరణించింది. మనుషులనే కాదు జంతువులను కూడ కరోనా వదలడం లేదు. వండలూరు జూ పార్క్ లో సింహం కరోనాతో బుధవారం నాడు మరణించిందని అధికారులు ప్రకటించారు.
పత్బనాథన్ అనే 12 ఏళ్ల మగ సింహనికి ఇటీవల అనారోగ్యానికి గురైంది. పరీక్షలు నిర్వహిస్తే ఈ నెల 3న కరోనా సోకిందని తేలింది.  ఈ నెల 16వ తేదీ ఉదయం 10:15 గంటలకు మగ సింహం కరోనాతో మరణించిందని  వండలూరు జూపార్క్ అధికారులు ప్రకటించారు.

అరిగ్‌నర్ అన్నా జూపార్క్ లో ఈ నెల 3న నీలా అనే మగ సింహం కూడ మరణించిన విషయం తెలిసిందే.  అదే జూలో మరో సింహం మరణించడం కలకలం రేపుతోంది. కరోనా సోకిన సింహన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ ఆ సింహం ప్రాణాలు దక్కలేదు. ఇదే జూపార్క్ లో ఉన్న మరో ఐదు సింహలు కూడ తరచూ దగ్గుతున్నాయి.  వీటి ఆరోగ్యంపై వెటర్నరీ వైద్యులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇటీవలనే తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ జూపార్క్ ను సందర్శించి జంతువుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జంతువులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios