ప్రముఖ సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారే మరోసారి నిరాహారదీక్షకు దిగారు. లోక్‌పాల్, లోకాయుక్త నియామకాల్లో కేంద్రప్రభుత్వం జాప్యాన్నిచేస్తోందంటూ మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో ఆయన దీక్షకు దిగారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘లోక్‌పాల్ బిల్లు 2013లోనే పార్లమెంట్ ఆమోదించింది. కానీ నేటి వరకు లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించలేదని మండిడ్డారు. అధికారంలోకి వచ్చే ఏ పార్టీ కూడా దీని గురించి పట్టించుకోవడం లేదని అన్నాహజారే అసహనం వ్యక్తం చేశారు.

ఈసారి లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాళణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన యువజన నాయకత్వ సదస్సులో పాల్గొన్న అన్నాహజారే నిరాహార దీక్ష గురించి ప్రకటించారు.

అవినీతిరహిత ప్రభుత్వం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ...లోక్‌పాల్ బిల్లును అమలు చేస్తారని తాను ఆశించానని కానీ ఐదేళ్లు గడిచిపోయినా ఆ దిశగా అడుగు ముందుకు పడలేదన్నారు. కేంద్రప్రభుత్వం కావాలనే దీనిని ఆలస్యం చేస్తోందని, అందుకే తాను మరోసారి దీక్షకు దిగుతున్నానని హజారే తెలిపారు.