వారు తమకు కనపడుతున్న పులులను కెమేరాలతో ఫోటోలు తీస్తూ ఆనందిస్తున్నారు. వాళ్లు అలా ఫోటోలు తీయడం నచ్చని పులి కోపంతో ఊగిపోయింది.

సఫారీ రైడ్ కి వచ్చిన ప్రయాణికులకు ఓ పులి చుక్కలు చూపించింది. కోపంతో ఊగిపోయిన పులి.. టూరిస్టులను వణికించింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ పర్యాటక బృందం ఉత్తరఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో సఫారీ రైడ్ కోసం వెళ్లారు. వారు తమకు కనపడుతున్న పులులను కెమేరాలతో ఫోటోలు తీస్తూ ఆనందిస్తున్నారు. వాళ్లు అలా ఫోటోలు తీయడం నచ్చని పులి కోపంతో ఊగిపోయింది. వారి మీదకు దూసుకువచ్చింది. అంతే.. ఆ ప్రయాణికులు భయంతో వణికిపోయారు. 

సుశాంత నంద అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి ఈ భయానక వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సఫారీ వాహనంలో ఉన్న వ్యక్తులు పులిని పొదల వెనుక దాక్కున్నట్లు గుర్తించిన తర్వాత దానిని చూడటం , ఫోటోలు తీయడం లాంటివి చేశారు. వారిని చూసి ఏమి ఫీలైందో తెలీదు కానీ, పెద్ద పులి సడెన్ గా ఎటాక్ చేయడం మొదలుపెట్టింది. గట్టిగా అరుస్తూ... వారి వాహనంపైకి దూకింది. కాగా.. ఇదంతా అక్కడున్నవారు వీడియో తీయగా, అది వైరల్ గా మారింది. 

Scroll to load tweet…

పులికి కోపం వచ్చింది అనే క్యాప్షన్‌తో మిస్టర్ నందా దానిని షేర్ చేసారు. ప్రతి నిర్ణీత గంటలలో వ్యక్తులు తమ హక్కుగా మీ ఇంట్లోకి దూసుకుపోతే మీరు ఏమి చేస్తారు?" పులి కూడా అదే చేసింది అని ఆయన పేర్కొనగా, నెటిజన్లు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 "పులులను" చూడాలనే మన అత్యుత్సాహం వాటి జీవితాలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది, మన జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.

అయితే.. ఈ ఘటనలో పులి దాడి చేయడానికి వస్తున్న క్రమంలో సఫారీ వాహన డ్రైవర్ తెలివిగా వాహనాన్ని కదలించాడు. దీంతో వారు దాదాపు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత పులి ఎవరికీ హాని చేయకుండా తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది, అయితే పర్యాటకులు షాక్‌కు గురయ్యారు. వారిలో చాలా మంది పెద్దగా అరవడం గమనార్హం.