భర్త చేతిలో దాదాపు సంవత్సరంపాటు... బానిసలా బతుకుతూ నరకం అనుభవించిన ఓ మహిళకు తాజాగా స్వేచ్ఛ లభించింది. పోలీసులు ఆమెకు విముక్తి కలిగించారు. వేరే మహిళతో తాను వివాహేతర సంబంధం పెట్టుకుంటానంటే.. భార్య అంగీకరించలేదని... ఆమెను దాదాపు సంవత్సరం పాటు  గొలుసులతో బంధించేశాడు. ఈ సంఘటన ఛతీస్ గడ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కంకర్ జిల్లా కాసవాహి ప్రాంతానికి  దోమర్ పటేల్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన మహిళకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కాగా... పటేల్ కి కొంత కాలం క్రితం మరో మహిళపై మోజు పెంచుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని తాపత్రయపడ్డాడు.

అందుకు భార్య ససేమిరా అంది. దీంతో.. కోపంతో ఊగిపోయాడు. భార్యను గొలుసులతో బంధించాడు. రోజూ కర్రలతో కొట్టి హింసించేవాడు. ఒక రోజు భోజనం పెట్టి... మరో రోజు అసలు పెట్టేవాడు కాదు. కాగా... ఈ విషయం చుట్టుపక్కల వారి సహాయంతో తాజాగా తెలుసుకున్న పోలీసులు.. ఆమెను రక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.