ఔరయ్యా జిల్లాకు చెందిన వధూవరులు పెళ్లి చేసుకునేందుకు పెళ్లిపందిరి వద్దకు వచ్చారు. సంప్రదాయబద్దంగా జరగాల్సిన వరమాల వేడుకలో వరుడు పూలదండను విసిరి వేసాడు. అంతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు వరుడుని పెళ్లాడేందుకు నిరాకరించింది. పెళ్లికూతురు నిర్ణయంతో వచ్చిన అతిథులు షాక్ కు గురయ్యారు.
లక్నో : పెళ్లిలో జరిగే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు వివాహాలే రద్దయ్యేలా చేస్తాయి. ఇదివరకటి కాలంలో ఇలాంటి ఘటనలు జరిగితే పెద్దలు సర్దిచెబితే గొడవ సద్దు మణిగేది. కానీ నేటి కాలంలో వధువు కానీ, వరుడు కానీ అస్సలు అలా ఒప్పుకోవడం లేదు. వందశాతం తాము అనుకున్నట్టే ఉండాలి. ఏ కాస్త తేడా వచ్చినా పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నారు. అలాంటి ఘటనే ఇది.
వివాహ వేడుకలో groom చేసిన చిన్న పొరపాటు వల్ల తాను అతన్ని పెళ్లి చేసుకోనని bride తెగేసి చెప్పిన ఘటన UttarPradesh రాష్ట్రంలో సంచలనం రేపింది. వరమాల వేడుకలో వరుడు garland విసిరేయడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలోని ఔరయ్యా జిల్లాలోని బిదునా కొత్వాలి పట్టణం నవీన్ బస్తీలో వెలుగుచూసింది.
ఔరయ్యా జిల్లాకు చెందిన వధూవరులు పెళ్లి చేసుకునేందుకు పెళ్లిపందిరి వద్దకు వచ్చారు. సంప్రదాయబద్దంగా జరగాల్సిన వరమాల వేడుకలో వరుడు పూలదండను విసిరి వేసాడు. అంతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు వరుడుని పెళ్లాడేందుకు నిరాకరించింది. పెళ్లికూతురు నిర్ణయంతో వచ్చిన అతిథులు షాక్ కు గురయ్యారు.
ఈ ఘటనతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెళ్ళికి వధువును ఒప్పించేందుకు పెళ్లి పెద్దలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటన జరిగినప్పుడు వరుడి కుటుంబీకులు భోజనం చేసేందుకు పెళ్లి పందిరి వద్ద నుంచి బయటకు వెళ్లారు. కాగా తాను పూలదండను విసిరి కొట్టలేదని వరుడు ఆకాష్ వివరణ ఇచ్చినా, పెళ్లి చేసుకునేందుకు మాత్రం వధువు ససేమిరా అని చెప్పేసింది. దీంతో పెళ్లి వేడుక కాస్తా ఆగిపోయింది.
ఇలాంటి ఘటనే జనవరి 11న ఇరాక్ లో జరిగింది. వారికి వివాహమై కొన్ని క్షణాలు అయింది Wedding ceremony ఇంకా పూర్తి కాలేదు. అక్కడ వినిపిస్తున్న పాటకి Bride స్టెప్పులేస్తూ ఉంది. ఇంతలో వరుడు ఆమెకు ఊహించని షాక్ ఇచ్చాడు. మనిద్దరం కలిసి ఉండడం కుదరదు... అంటూ ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
ఇరాక్ లో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. అతడి అనూహ్య నిర్ణయం గురించి తెలిస్తే మనం మరింత షాక్ అవుతాం. ఆ వేడుకలో వినిపిస్తున్న పాట.. అతడికి, తల్లిదండ్రులకు అసలు ఏమాత్రం నచ్చలేదు. ఆ పాట Provocative Song అని, పెడ ధోరణులను రెచ్చగొట్టే విధంగా ఉందనేది వారి అభిప్రాయం.
ఆ పాట అర్థం… అందులోని అంతరార్థం స్పష్టంగానే తెలుస్తున్నా కూడా వధువు తనను తాను మరచిపోయి నృత్యం చేయడాన్ని భరించలేకపోయాడు. పై చేయి నాది.. నీవు నీ కంట్రోల్ లోనే ఉండాలి... ఇలా సాగింది ఆ పాట. దీంతో చిర్రెత్తుకొచ్చిన వరుడు ఈ ఆధిపత్యం భరించలేను అంటూ అప్పటికప్పుడు భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గొడవలు, చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
