Asianet News TeluguAsianet News Telugu

క్షణికావేశం.. బార్బర్ నచ్చిన విధంగా హెయిర్‌ కట్‌ చేయలేదని.. 16వ అంతస్థు నుంచి.. 

బార్బర్ తనకు నచ్చిన విధంగా హెయిర్‌ కట్‌ (haircut ) చేయలేదని ఓ టీనేజర్  మనస్తాపానికి గురై బిల్డింగ్‌ పైనుంచి దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో  జరిగింది. 

Angered over haircut, teenage boy jumps to death from 16th floor in Maharashtra's Bhayandar krj
Author
First Published Apr 6, 2023, 8:00 PM IST

నేటీ యువత సోషల్ మీడియాను అనుసరిస్తూ.. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. ఈ క్రమంలో నలుగురిని ఆట్రాక్ట్ చేసేలా ఉండాలని, వారు చేసే ప్రతి పనిలోనూ కాస్త వెరైటీ ఉండేలా చూసుకుంటుంది.  ప్రధానంగా బాయ్స్.. తమ డ్రెస్సింగ్,హెయిర్ కటింగ్, ఆక్సాసిరీస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ చాలా స్టైలిష్ గా ఉండాలని కోరుకుంటారు. బాయ్స్  మరీ ముఖ్యంగా..హెయిర్ కట్‌ విషయంలో చాలా అంటే.. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.హెయిర్ స్టైల్ బాగుంటే.. లుక్ అంతా పర్పెక్ట్ గా ఉంటుందనీ, అందంగా కనిపిస్తామని భావిస్తారు.

మరికొందరూ సినీ హీరోలు, సెలబ్రిటీల హెయిర్ స్టైల్  ఫాలో అవుతున్నారు. ఇలా యూత్ ట్రెండ్‌కి తగినట్టు.. తమ హెయిర్ ను చాలా స్టైలిష్ గా కట్ చేయించుకుంటున్నారు. ఒకవేళ హెయిర్ కట్ విషయంలో  ఏమైనా తేడా వస్తే.. అంతే..  వారి బాధ వర్ణనానీతం. తమని తాము ఏదైనా చేసుకోవడానికైనా సిద్దపడుతుంటారు. నిజంగా యువత హెయిర్ స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు బాబు. ఈ కోవకు చెందిన ఓ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఓ టీనేజర్ ..బార్బర్ తనకు నచ్చిన హెయిర్ కట్ చేయలేదనీ, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎవ్వరూ ఊహించని విధంగా .. బిల్డింగ్‌ పైనుంచి దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. మహరాష్ట్రలోని భయాందర్‌ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలుడు స్టైలిష్ గా కటింగ్ చేయించుకుందామని.. జుట్టు విపరీతంగా పెంచుకున్నాడు. అయితే..అతని కుటుంబ సభ్యులు ఆ బాలుడికి హెయిర్‌ సెలూన్ కి వెళ్లారు. అయితే.. ఆ బార్బర్ ఆ బాలుడు చెప్పినట్టు స్టైలిష్ గా చేయకుండా.. జుట్టును చాలా చిన్నగా కత్తిరించారు. ఆ హెయిర్ కట్ ఆ బాలుడికి ఏమాత్రం నచ్చలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత.. తన హెయిర్ ను  పదే పదే అద్దంలో చూసుకుంటూ.. తనకు ఆ హెయిర్‌ స్టైల్‌ నచ్చలేదని కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కొన్ని రోజుల తరువాత జుట్టు పెరుగుతుంది.. నీకు నచ్చిన హెయిర్ స్టైల్ చేయించుకోమని కుటుంబ సభ్యులు నచ్చచెప్పారు. అయినా.. ఆ బాలుడి కోపం ఏ మాత్రం తగ్గలేదు. ఇంట్లో ఎవరితో మాట్లాకుండా ఒంటరిగా గదిలో ఉండిపోయాడు. తనలో తాను లోలోపలే కుమిలిపోయాడు.  తీవ్ర మనస్తాపానికి గురైనా ఆ బాలుడు మరుసటి రోజు బాత్రూంలోకి వెళ్లి డోర్ చేసుకున్నారు. ఎంతసేపటికీ బయటకు రాలేదు. అప్పటికే బాలుడు బాత్రూం కిటికీ తెరిచి.. 16వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలపాలవ్వడంతో.. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న నవఘర్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఃకాగా .. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న అపార్ట్‌మెంట్‌ వాసులు, స్థానికులు షాక్‌ అయ్యారు. టీనేజ్‌ పిల్లల తొందరపాటు నిర్ణయాలు తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో ఆ బాలుడు తీసుకున్న నిర్ణయం అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపేసింది. కన్న కొడుకు ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.   

Follow Us:
Download App:
  • android
  • ios