ఓ స్ట్రీట్ వెండార్ కి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఆ వ్యక్తి తనకు అతిథిగా రావాలంటూ ఆయన ట్వీట్ చేయడం విశేషం.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఓసారి చూద్దాం..
ఆనంద్ మహీంద్రా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన వ్యాపార పరంగా ఎంత బిజీగా ఉన్నా... సోషల్ మీడియాల చాలా చురుకుగా ఉంటారు. తనకు నచ్చిన ప్రతి విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఆయన షేర్ చేసే ప్రతి ఫోటో, వీడియో లో ఏదో ఒక సందేశాత్మక విషయాన్ని తెలియజేడయానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఓ స్ట్రీట్ వెండార్ కి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఆ వ్యక్తి తనకు అతిథిగా రావాలంటూ ఆయన ట్వీట్ చేయడం విశేషం.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఓసారి చూద్దాం..
ఆ వీడియోలొ వ్యక్తి స్ట్రీట్ వెండర్. స్వీట్ కార్న్ అమ్ముతూ ఉన్నాడు. అయితే... అతను సాధారణ వ్యాపారి మాత్రం కాదు. ఎందుకంటే... తాను స్వీట్ కార్న్ తయారు చేస్తూ అమ్ముతూనే... గంటెలతోనూ మ్యూజిక్ వాయిస్తూ మెస్మరైజ్ చేయడం ఇక్కడ విశేషం. అతని టాలెంట్ కి ఆనంద్ మహీంద్రా మెస్మరైజ్ అయిపోయాడు.
ఈ జెంటిల్మెన్ ఎక్కడ పనిచేస్తాడో తెలీదు కానీ త్వరలో బెంగుళూరులో జరగబోయే మహీంద్రా రిథమ్ ఫెస్టివల్ కి ఇతను గెస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను, తనకు నచ్చిన సంగీతంతో తన పనిని ఆస్వాదిస్తున్న ఇతను తృప్తిగా జీవించడంలో సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాడు' అంటూ అతని వీడియోని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం. నెటిజన్లు కూడా అతని టాలెంట్ కి ఫిదా అయిపోతున్నారు.
