ఓ వీడియో చూసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు  ఆయన చెప్పడం విశేషం. నిర్ణయాన్ని మార్చుకోవడమే కాదు, ఏకంగా జిమ్ కి వెళ్లి కసరత్తులు చేశాడు.

ఆదివారం అనగానే, అందరూ విశ్రాంతి తీసుకోవాలనే అనుకుంటారు. ఆఫీసు పనులు ఉండవు కాబట్టి, ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా, ప్రశాంతంగా ఉండాలని, కనీసం ఎలాంటి వ్యాయామం కూడా చేయడానికి ఇష్టపడరు. ప్రముఖ వ్యాపారవేత్త మహేంద్ర కూడా ఈ ఆదివారం అదే చేయాలని అనుకున్నారట. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని అనుకున్నారట. కానీ, ఓ వీడియో చూసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆయన చెప్పడం విశేషం. నిర్ణయాన్ని మార్చుకోవడమే కాదు, ఏకంగా జిమ్ కి వెళ్లి కసరత్తులు చేశాడు.

ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ ఆ విషయాన్ని పంచుకున్నాడు. దీంతో, ఈ వీడియో చూసి నెటిజన్లు సైతం షాకౌతున్నారు. వారు కూడా వీడియోకి ఫిదా అయిపోయి, తాము కూడా రెస్ట్ అనే పదాన్ని పక్కన పెట్టి, నిర్ణయాన్ని మార్చుకోవాలని భావిస్తుండటం విశేషం.

Scroll to load tweet…

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా? ఆ వీడియోలో ఐదుగురు వృద్ధులు ఉన్నారు. వారంతా 60ఏళ్ల వయసు పైబడినవారే కావడం గమనార్హం. కాగా, వారంతా చేస్తుున్న విన్యాసాలు చూస్తుంటే ఎవరైనా నోరు వెళ్ల పెట్టాల్సిందే. వారి ఫిట్నెస్ కి ఫిదా అయిపోయిన మహేంద్ర.. వెంటనే రెస్ట్ తీసుకోవాలనే నిర్ణయాన్నే పక్కన పెట్టి, జిమ్ కి పరుగులు తీశారు. నెటిజన్లు సైతం తాము కూడా ఫిట్నెస్ పై ఫోకస్ పెడతామని కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఈ వీడియోకి 3లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.