Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన దాతృత్వంతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు. అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చాడు.
Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన దాతృత్వంతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు. అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఆనంద్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇచ్చాడు.
ప్రతిభావంతులైన యువ ఆటగాడు ప్రజ్ఞానంద ఇటీవల చెస్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అయితే..ఆ చైన్నై చిన్నోడు టైటిల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌తో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలువల్సివచ్చింది. ప్రజ్ఞానంద అంతకుముందు కార్ల్‌సెన్‌ను ఓడించాడు, కానీ ఫైనల్‌లో ఆ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయాడు. అయినా సరే.. తన ప్రతిభతో కోట్లాది మంది భారతీయుల మనస్సును గెలుచుకున్నారుడు ఈ యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.
ఈ తరుణంలో ఆనంద్ మహీంద్రా.. ప్రజ్ఞానందను అభినందనలతో ముంచెత్తుతూ.. గ్రాండ్ మాస్టర్ తల్లిదండ్రులకు ఇటీవల ఓ బహుమతి ప్రకటించారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్‌బాబులకు XUV400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నాననీ, ఈ బహుమతికి వారిద్దరూ అర్హులనీ, వారు తన కుమారుని అభిరుచిని పెంపొందించినందుకు, అతనికి నిరంతర మద్దతును అందించినందుకు మా కృతజ్ఞతలు. అని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో పేర్కొన్నారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు మహీంద్రా & మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ రాజేష్ జెజురికర్ కూడా స్పందించారు. "మీ అద్భుతమైన విజయానికి అభినందనలు ప్రజ్ఞానంద. అతని తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్‌బాబులను గుర్తించి, కృతజ్ఞతలు తెలిపే ఆలోచనకు ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు. ఆల్ ఎలక్ట్రిక్ SUV XUV400 ప్రత్యేక ఎడిషన్ ఈవీని అతి త్వరలో బహుమతిగా అందిస్తాం అని హామీ ఇచ్చారు.
ఈ ప్రత్యేక బహుమతిపై యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద స్పందిస్తూ..ఆనంద్ మహీంద్రా, రాజేష్ జెజురికర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. రాజేష్ జెజురికర్ పోస్ట్‌కు ప్రజ్ఞానంద సమాధానమిస్తూ, " కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు కూడా రావటం లేవు. ఆనంద్ మహీంద్రా సర్,రాజేష్ జెజురీకర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. EV కారు కొనడం నా తల్లిదండ్రుల చిరకాల కల, ఆ కలను నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రా సర్, రాజేష్ జెజురికర్ సర్ లకు ధన్యవాదాలు! " అని పేర్కొన్నారు.
ప్రజ్ఞానంద ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా ప్రతిస్పందనగా.. "కార్ల తయారీదారు యొక్క అంతిమ లక్ష్యం ..కస్టమర్ల కలలను నేరవేర్చడమే." అని పేర్కొన్నారు.
