పిల్లలకు ది బెస్ట్ డ్రెస్ ఇది.. ఆనంద్ మహీంద్రా స్పెషల్ వీడియో..!
కొత్త ఆవిష్కరణలను, ఆసక్తికర విషయాలను ఆయన షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా, పిల్లల కోసం ఆయన ఓ ప్రత్యేక వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ ప్రత్యేకమైన టీషర్ట్ ఆయనను పరిచయం చేశారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త పోస్టులు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటున్నారు. కొత్త ఆవిష్కరణలను, ఆసక్తికర విషయాలను ఆయన షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా, పిల్లల కోసం ఆయన ఓ ప్రత్యేక వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ ప్రత్యేకమైన టీషర్ట్ ఆయనను పరిచయం చేశారు.
ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక వ్యక్తి టీ-షర్ట్ ఎలా పనిచేస్తుందో ప్రదర్శిస్తున్నాడు."ఇది నోబెల్ బహుమతిని పొందకపోవచ్చు, కానీ ఇది నాకు ఆ ఆవిష్కరణల కంటే ఉన్నత స్థానంలో ఉంది. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లల తాతగా, వారి శ్రేయస్సు & భద్రత నా అత్యధిక ప్రాధాన్యత" అని మహీంద్రా క్యాప్షన్‌లో రాశారు.
ఈ పోస్ట్‌కి 187k పైగా వీక్షణలు, టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. Floatee అనే ఫ్రెంచ్ కంపెనీ ఈ ప్రత్యేకమైన టీ-షర్ట్‌ను అభివృద్ధి చేసింది. "ఈరోజు, మేము నీటిలో ఉన్న పిల్లలను ఆర్మ్‌బ్యాండ్‌లు, బోయ్‌లు, స్విమ్మింగ్ వెస్ట్‌లు మొదలైన వాటితో రక్షిస్తాము. అయితే అవి నీటి నుండి అసాధ్యమైనవి, నీటిలో మొదట పడిన సందర్భంలో రక్షణను అందించవు" అని వారు పేర్కొన్నారు.
పిల్లలకు ఈత రానప్పుడు, పొరపాటున నీటిలో పడిపోయినప్పుడు పిల్లలను రక్షించడం కష్టమైపోతుంది. అలాంటివారికి ఈ టీషర్ట్స్ బాగా ఉపయోగపడతాయని వారు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన టీ-షర్ట్ 149 యూరోలకు (సుమారు రూ. 13,000) అమ్ముతున్నారు. ఆ టీషర్ట్‌తో నెటిజన్లు బాగానే ఆకట్టుకున్నారు. ఇది తల్లిదండ్రులకు కాస్త ఊరటనిస్తుందని పలువురు వ్యాఖ్యానించారు.