Anand Mahindra: సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం నిర్వ‌హిస్తున్న ఓ ఆర్మీకేఫ్ కు పారిశ్రామిక వేత్త‌, ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఆ కేఫ్ కు 10 రేటింగ్ ఇచ్చేశారు. భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి అనేక కేఫ్‌లను నడుపుతోంది.  అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వ్యాలీలో నడుస్తున్న ఇండియన్ ఆర్మీ కేఫ్‌ గురించి పోస్ట్ చేసారు. 

Anand Mahindra: ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌, మ‌హేంద్ర & మ‌హేంద్ర అధినేత ఆనంద్ మహీంద్రా.. ఆయ‌న గురించి ప్ర‌త్యేక‌ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆయ‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నెటిజ‌న్ల‌తో పంచుకుంటూ.. ఆశ్చర్యపరుస్తారు. స్ఫూర్తిదాయకమైన కోట్స్ నుండి హృదయాన్ని కదిలించే పోస్ట్‌ల వరకు అనేక ర‌కాల పోస్టుల‌ను చేస్తుంటారు. అలా త‌న ఫాలోవ‌ర్ల‌ను ఫిదా చేశారు. తాజాగా ఆయ‌న ఓ కేఫ్ సంబంధించిన వీడియోను చూసి.. ఫిదా అయ్యారు. అంతటితో ఆగ‌కుండా.. ఆ కేఫ్ కు 5 స్టార్ లేదా 7 స్టార్ కాదు.. 10 స్టార్ రేటింగ్ ఇచ్చేశారు. ఇప్పుడూ ఆ వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. ఆ కేఫ్ అందాల‌ను చూసిన నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

వివరాల్లోకెళ్తే.. గరిమా గోయెల్ అనే యువ‌తి.. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ వ్యాలీ స‌మీపంలో ఇండియన్ ఆర్మీ నిర్వ‌హిస్తున్న లాగ్ హట్ కేఫ్ (Log Hut Café)ను సంద‌ర్శించారు. కేఫ్ లోని ఆహ్లాదక‌ర వాతావ‌రణం, అలంక‌ర‌ణ‌ను చూసి ముద్దురాలై.. ఆమె ఆ అందాల‌ను వీడియో తీసి.. ట్వీట్ట‌ర్ లో పోస్టు చేసింది. 

ఈ వీడియోలో.. ఆమె గురెజ్ వ్యాలీలో ఇండియ‌న్ ఆర్మీ నిర్వ‌హిస్తున్న‌ Log Hut Café ను సందర్శించినట్లు చూపించి.. ఆమె లాగ్ హట్ కేఫ్ చూట్టూ తిరుగుతూ.. అక్క‌డి వాతావరణం, అలంకరణను చూపించే ప్ర‌య‌త్నం చేసింది గోయెల్. అలాగే.. ఆమె కేఫ్‌లో ల‌భించే వివిధ రకాల ఆహారం, పానీయాలను కూడా చూపించింది. భారత సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి అనేక కేఫ్‌లను నడుపుతోంది. 

ఈ వీడియోకు ఫిదా అయిన‌ ఆనంద్ మహీంద్రా.. త‌నదైన శైలిలో కామెంట్ చేశారు. "నాకు సంబంధించినంతవరకు, ఈ కేఫ్ 5 స్టార్ లేదా 7 స్టార్ కాదు, కానీ 10 స్టార్ డెస్టినేషన్! అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోకు నెటిజ‌న్లు నుంచి భారీ స్పంద‌న వ‌స్తుంది. ల‌క్షలాది వ్యూస్ .. వేలాది కామెంట్స్ వ‌చ్చాయి. ఓ సారి మీరు కూడా లాగ్ హట్ కేఫ్‌ని సందర్శించండి మ‌రీ..

Scroll to load tweet…